NTV Telugu Site icon

SEBI: పాన్-ఆధార్ లింక్ లేకున్నా.. మ్యూచువల్ ఫండ్ కేవైసీ

Sebi

Sebi

మ్యూచువల్ ఫండ్ లో డబ్బును ఇన్వెస్ట్ చేసే వాళ్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) గుడ్ న్యూస్ చెప్పింది. కేవైసీ (KYC) నమోదు చేయడంలో సమస్యతో పోరాడుతున్న వారికి ఉపశమనం కలిగించింది. పాన్-ఆధార్ లింక్ చేసే నిబంధనాన్ని సెబీ తొలగించింది. అంటే పాన్-ఆధార్ లింక్ లేకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ కేవైసీ చేయలేని వారు ఇప్పుడు దీన్ని సులభంగా చేయవచ్చు. పెట్టుబడిదారులు తమ కేవైసీ అవసరాలను తీర్చడానికి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను ఉపయోగించవచ్చని తెలిపింది. ఒకవేళ ఆధార్ లేకపోతే దాని స్థానంలో మరేదైనా పత్రాన్ని ఉపయోగించవచ్చు. కేవైసీని ఎలాంటి అదనపు పత్రాలు ఇవ్వకుండానే పూర్తి చేయవచ్చు. పాన్, పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ IDని ఉపయోగించి మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్‌ల కేవైసీ ని ధృవీకరించాలని కేవైసీ రిజిస్టర్డ్ ఏజెన్సీలను అభ్యర్థించింది. పాన్ మరియు ఆధార్ కార్డ్ ఆధారంగా ఆదాయపు పన్ను (ఐటి) వంటి అధికారిక డేటాబేస్‌లతో పెట్టుబడిదారుల వివరాలను తనిఖీ చేయడం లక్ష్యం.

READ MORE: Weather : భగభగమంటున్న భానుడు.. ఢిల్లీలో 14ఏళ్ల రికార్డు ఉష్ణోగ్రతలు

2023 అక్టోబర్‌లో SEBI అన్ని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులను ఓ సర్క్యులర్ జారీ చేసింది. వినియోగదారులు పాన్‌ను మార్చి 31, 2024 లోపు ఆధార్‌తో లింక్ చేయాలని కోరింది. లింకింగ్ చేయకపోతే కేవైసీ ప్రక్రియ ఆగిపోతుందని.. ఇది పెట్టుబడి కార్యకలాపాలను ఆపివేస్తుందని వెల్లడించింది. చిరునామా ఆధారంగా బ్యాంక్ పాస్‌బుక్ లేదా ఖాతా వివరాలను ఉపయోగించి కూడా కేవైసీ చేయవచ్చని పేర్కొంది. చాలా మంది పెట్టుబడి దారులు ఇబ్బందులు పడుతున్నట్లు గమనించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.