SEBI: పాన్-ఆధార్ లింక్ లేకున్నా.. మ్యూచువల్ ఫండ్ కేవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యూచువల్ ఫండ్ లో డబ్బును ఇన్వెస్ట్ చేసే వాళ్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) గుడ్ న్యూస్ చెప్పింది. కేవైసీ (KYC) నమోదు చేయడంలో సమస్యతో పోరాడుతున్న వారికి ఉపశమనం కలిగించింది. పాన్-ఆధార్ లింక్ చేసే నిబంధనాన్ని సెబీ తొలగించింది. అంటే పాన్-ఆధార్ లింక్ లేకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ కేవైసీ చేయలేని వారు ఇప్పుడు దీన్ని సులభంగా చేయవచ్చు. పెట్టుబడిదారులు తమ కేవైసీ అవసరాలను తీర్చడానికి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను ఉపయోగించవచ్చని తెలిపింది. ఒకవేళ ఆధార్ లేకపోతే దాని స్థానంలో మరేదైనా పత్రాన్ని ఉపయోగించవచ్చు. కేవైసీని ఎలాంటి అదనపు పత్రాలు ఇవ్వకుండానే పూర్తి చేయవచ్చు. పాన్, పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ IDని ఉపయోగించి మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్‌ల కేవైసీ ని ధృవీకరించాలని కేవైసీ రిజిస్టర్డ్ ఏజెన్సీలను అభ్యర్థించింది. పాన్ మరియు ఆధార్ కార్డ్ ఆధారంగా ఆదాయపు పన్ను (ఐటి) వంటి అధికారిక డేటాబేస్‌లతో పెట్టుబడిదారుల వివరాలను తనిఖీ చేయడం లక్ష్యం.
READ MORE: Weather : భగభగమంటున్న భానుడు.. ఢిల్లీలో 14ఏళ్ల రికార్డు ఉష్ణోగ్రతలు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
2023 అక్టోబర్‌లో SEBI అన్ని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులను ఓ సర్క్యులర్ జారీ చేసింది. వినియోగదారులు పాన్‌ను మార్చి 31, 2024 లోపు ఆధార్‌తో లింక్ చేయాలని కోరింది. లింకింగ్ చేయకపోతే కేవైసీ ప్రక్రియ ఆగిపోతుందని.. ఇది పెట్టుబడి కార్యకలాపాలను ఆపివేస్తుందని వెల్లడించింది. చిరునామా ఆధారంగా బ్యాంక్ పాస్‌బుక్ లేదా ఖాతా వివరాలను ఉపయోగించి కూడా కేవైసీ చేయవచ్చని పేర్కొంది. చాలా మంది పెట్టుబడి దారులు ఇబ్బందులు పడుతున్నట్లు గమనించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!