Uttar Pradesh: కనీసం అలాంటప్పుడు కూడా సెలవు ఇవ్వరు: కానిస్టేబుల్ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఒత్తిడితో కానిస్టేబుల్స్ చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ మధ్యకాలంలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ లో వీరి పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీని గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు వచ్చేలా ఉంది. వివరాల ప్రకారం యూపీలోని బాగ్పట్ పోలీస్ డిపార్టుమెంట్‌కు చెందిన కానిస్టేబుల్ ఓం వీర్‌సింగ్ రాష్ట్రంలో వారి దుస్థితి గురించి ఓ వీడియో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.గడిచిన రెండేళ్లలో దాదాపు 10 నుంచి 12 మంది కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఉటంకిస్తూ తమపై చాల ఒత్తిడి ఉంటుందని, తమకు ఎందుకు ఇలాంటి దుస్థితి అని ఓం వీర్ ప్రశ్నించారు. పాల్పడ్డారని, రెండు రోజుల క్రితం కూడా అయోధ్యలో ఒక కానిస్టేబుల్, మీరట్‌లో ఒక కానిస్టేబుల్ తమ సర్వీస్ రైఫిల్స్‌లో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Multibagger Stock: 1200శాతం పెరిగిన టాటా కంపెనీ షేర్లు.. కొన్నవాళ్లు కోటీశ్వరులు కావడం ఖాయం
Also Read
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ఇక ఓం వీర్‌సింగ్ దుఃఖం ఆపుకుంటూ చెప్పిన ఓ విషయం గుండెలను పిండేస్తుంది. ఈ ఏడాది జూలై 20న తన సోదరి మరణించిందని, దాంతో సెలవు కావాలని అడిగితే పై అధికారులు ఇవ్వలేదని, తాము మనుషులం కాదా అని ప్రశ్నించారు. ఇక స్వస్థలంలో కాకుండా వేరే చోట తమ పోస్టింగ్ ఉంటుందని, కనీసం స్వగ్రామంలో పోస్టింగ్ వేసిన తమ వారి సెలవులు లేనప్పటికి తమ వారిని చూసుకుంటూ ఉంటామని వీర్ సింగ్ పేర్కొ్న్నారు. దూరప్రాంతంలో పోస్టింగ్ వల్ల రోజులు తరబడి అక్కడే ఉండాల్సి వస్తుందని, ఆఖరికి మనుషులు మరణించినా వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఉన్నతాధికారులు ఇప్పటికైనా కానిస్టేబుళ్ల పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో చూస్తే గుండె తరుక్కపోతుందని, చాలా బాధగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసి అయినా ఉన్నతాధికారులు మారతారో లేదో చూడాలి మరి.
Video of UP police constable Omveer Singh from Baghpat has surfaced on social media. Directs attention towards the cases of suicide by cops. "I am hurt because my sister died on July 20. My leave was not approved," he said. pic.twitter.com/hGOudoOVHx
— Piyush Rai (@Benarasiyaa) August 27, 2023
తాజావార్తలు
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!