NTV Telugu Site icon

Viral Video: వార్నీ .. కోతులు కూడా టమోటాలను వదల్లేదుగా..

Mi

Mi

ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. టమోటా ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. టమోటాలు అమ్మి కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు.. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టమోటా చో్రీలు జరుగుతున్నాయి.. గత కొన్ని రోజుల క్రితం ఉల్లిపాయ ధరలు కన్నీళ్లు పెట్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు జనాలకు కడుపు మంటను తెప్పిస్తున్నాయి.. గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదు..

ఈ క్రమంలోనే టమాటా ధరలకు సంబందించి అనేక రకాల మీమ్స్‌, జోకులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అంతేకాదు. టమాట దొంగతనాలు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా టమాటాలకు సంబంధించిన ఒక వైరల్‌ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ కోతి ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్న టమోటాలను దొంగలించింది.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒకరి ఇంటి తలుపులు బార్ల తెరిచి ఉండటం కనిపించింది. ఇంట్లోని వారేవరూ కనిపించటం లేదు. అంతలోనే ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక కొండముచ్చు ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఎదురుగా ఒక ప్లాస్టిక్‌ బుట్టలో టమాటాలు, బంగాళదుంపలు వేసి ఉండటం చూసింది..

ఇక పంట పండింది అని అనుకుంది.. బంగాళా దుంపలను పక్కన పెట్టేసి పక్కన ఉన్న టమోటాను చేత పట్టుకొని వెళ్లిపోయింది.. ఒక్కో టమాటా తీసుకుని తినటం మొదలు పెట్టింది. ముందుగా ఓ బంగాళదుంప నోట్లో పెట్టుకుంది.. కానీ, ఎదురుగా ఎవరో వచ్చినట్టుగా అనిపించింది. దాంతో ఆ కొండముచ్చు టమాటా చేతిలో పట్టుకుని అక్కడ్నుంచి పారారైంది. ఇదంతా ఎవరు వీడియో తీశారో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. టమోటాకు తగ్గే వరకు ఇలాంటి ఎన్ని వింతలు జరుగుతాయో అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..