దేశంలో సాధారణ వాణిజ్య విభాగంలోని వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను తీసుకొస్తున్నాయి. యూలర్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మినీ ట్రక్కును విడుదల చేసింది. భారత మార్కెట్లో యూలర్ టర్బో EV 1000 ను విడుదల చేసింది. ఈ మినీ ఎలక్ట్రిక్ ట్రక్కును కళ్లు చెదిరే ఫీచర్లతో విడుదల చేశారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, యూలర్ కొత్త ట్రక్కు అనేక వినూత్న లక్షణాలను కలిగి ఉంది. వీటిలో మొట్టమొదటి బెజెల్-రహిత హెడ్‌ల్యాంప్‌లు, రాత్రిపూట మెరుగైన ప్రకాశాన్ని అందించే అధిక-ప్రకాశం హెడ్‌లైట్‌లు ఉన్నాయి.
Also Read:Madanapalle : ఒకసారిగా భారీగా పతనమైన టమాటా ధర.. మదనపల్లె మార్కెట్ షాక్
యూలర్ నుండి వచ్చిన ఈ మినీ ట్రక్కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 నుండి 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీని మోటార్ 140 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. భద్రత కోసం, ఇందులో డిస్క్ బ్రేక్‌లు, R13 వీల్ ప్లాట్‌ఫామ్ ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి బ్యాటరీని 15 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ మినీ ట్రక్కును కంపెనీ భారత మార్కెట్లో రూ. 5.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు.
