Site icon NTV Telugu

Etv Win Vs Zee 5 : జీ5పై ఈటీవీ విన్ కాపీ ఆరోపణలు..!

Etv

Etv

తాము ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ కథను ఆధారంగా చేసుకుని మరొక ఓటీటీ సంస్థ ఏకంగా వెబ్ సిరీస్ సిద్ధం చేసి స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా ఉందని ఈటీవీ విన్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించింది. ప్రశాంత్ అనే దర్శకుడి దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ అనౌన్స్ చేసింది ఈటీవీ విన్. అయితే కొద్ది రోజుల క్రితం జి5లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్లు విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే సిరీస్ ను అనౌన్స్ చేసి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత తన కథనే కొన్ని మార్పులు చేసి జీ ఫైవ్ లో ఈ సిరీస్ సిద్ధం చేసినట్లు దర్శకుడు గ్రహించారని వెంటనే వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తే ముందు సిరీస్ చూపిస్తామని చెప్పారు కానీ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారని ఈటీవీ విన్ ప్రతినిధులు వెల్లడించారు.

READ MORE: Donald Trump: “పిల్లలురా మీరు”.. ఇజ్రాయిల్-ఇరాన్‌పై ట్రంప్ వ్యాఖ్యలు..

ఇక దర్శకుడు మాట్లాడుతూ తాను ఈ కథ జి5 సంస్థకు కూడా చెప్పానని వారికి మెయిల్ ద్వారా స్క్రిప్ట్ కూడా పంపించానని, ఎనిమిది నెలలు పనిచేసిన అనంతరం అది పట్టాలెక్కలేదని చెప్పుకొచ్చారు. తర్వాత నిర్మాతలతో కలిసి ఇదే ప్రాజెక్టుని ఈటీవీ విన్ లో చేయడం ప్రారంభించామని అయితే తమ షూట్ పూర్తయి ఆగస్టులో స్ట్రీమింగ్ చేద్దామని సిద్ధమవుతున్న సమయంలో ఇలా ఈ ట్రైలర్ చూసిన తర్వాత షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం మీద సదరు సంస్థతో మాట్లాడే ప్రయత్నం చేసినా అక్కడి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదని అందుకే కోర్టులో లీగల్ గా ముందుకు వెళుతున్నామని చెప్పుకోచ్చారు. కోర్టులో ఎలాంటి తీర్పు అయినా రావచ్చు కానీ ఈ కథ మాది, మా ఒరిజినల్ అనే విషయాన్ని వెల్లడించాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చామని ఈటీవీ విన్ ప్రతినిధులు పేర్కొన్నారు .

Exit mobile version