Etikoppaka Bommalu: ఏటికొప్పాక బొమ్మల శకటానికి బహుమతి.. సీఎం హర్షం..
- ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటానికి థర్డ్ ప్లేస్
- స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిపబ్లిక్ డే రాష్ట్రాల శకట ప్రదర్శనలో ఏపీ శకటానికి థర్డ్ ప్లేస్ వచ్చింది.. ఏటికొప్పాక బొమ్మల కొలువు థీమ్‌తో ఏపీ శకటం అందరి దృష్టిని ఆకట్టుకుంది.. మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్ (మహాకుంభ్), రెండో స్థానంలో త్రిపుర (14 దేవతల ఖర్చి పూజ) నిలిచాయి. రక్షణ శాఖ ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను ప్రకటించింది. మరోవైపు త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందానికి బహుమతి దక్కింది. అలాగే కేంద్ర బలగాల విభాగంలో దిల్లీ పోలీసు కవాతు బృందానికి ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్‌గా బహుమతి దక్కినట్లు రక్షణశాఖ వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన శకటం బహుమతి గెలుచుకోవడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో స్పందించారు.30 ఏళ్ల తర్వాత ఏపీ శకటానికి కేంద్ర పురస్కారం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
READ MORE: Health Tips: నరాల బలం కోసం ఇవే బెస్ట్ ఫుడ్స్.. వీటిని తింటే ఏ ఢోకా ఉండదు!
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
“ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో ఏటికొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి మూడో స్థానం రావడం సంతోషకరం… రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ శకటం, రెండవ స్థానంలో త్రిపుర శకటం ఉండగా మూడో స్థానం ఏపీకి దక్కింది. ఈ సందర్భంగా శకటం రూపకర్తలకు, రాష్ట్ర అధికారులకు… ప్రత్యేకించి ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులకు అభినందనలు తెలుపుతున్నాను.” అని చంద్రబాబు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
READ MORE: CPI Ramakrishna: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!