NTV Telugu Site icon

Mahua Moitra: నేడు మహువా మొయిత్రాపై లోక్‌సభ స్పీకర్‌కు ఎథిక్స్‌ కమిటీ నివేదిక

Mahua Moitra

Mahua Moitra

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఆమెపై విచారణ జరిపింది. అంతకుముందు మహువా మోయిత్రాపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేను కూడా విచారించింది.

Read Also: Air Taxi: 2026 నాటికి అందుబాటులోకి ఎయిర్ ట్యాక్సీలు.. ఫస్ట్ ఏ నగరాల్లో అంటే?

ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ మహువాపై చర్యలు తీసుకునేందుక రెడీ అయింది. ఇప్పటికే ఈ కేసులో ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదికను రెడీ చేసింది. ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తూ చేసిన సిఫారసులను ఫ్యానెల్ ఆమోదించింది. 6:4 మెజారిటీలో సభ్యులు తీర్పును ఆమోదించింది. మహువాపై చర్యలు తీసుకోవాలని ఆరుగురు సభ్యులు మద్దతు తెలుపగా.. నలుగురు మాత్రం వ్యతిరేకించారు. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, హేయమైనవని, ఆమె నేరం చేసిందని చెబుతూ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్యానెల్ సూచించింది. ఎథిక్స్ కమిటీ సిఫారసులను ఇవాళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నారు.

Read Also: Israel-Hamas War: వెస్ట్ బ్యాంక్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 14 మంది మృతి..

టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై చర్యలకు సపోర్టు తెలిపిన సభ్యుల్లో అపరాజిత సారంగి, రాజ్‌దీప్ రాయ్, సుమేధానంద్ సరస్వతి, ప్రణీత్ కౌర్, వినోద్ సోంకర్, హేమంత్ గాడ్సే ఉన్నారు. వ్యతిరేకించి వారిలో డానిష్ అలీ, వి వైతిలింగం, పిఆర్ నటరాజన్, గిరిధారి యాదవ్ ఉన్నారు. మహువా పార్లమెంట్‌ బహిష్కరణను సమర్ధించిన వారిలో కాంగ్రెస్‌ సస్పెండెడ్‌ ఎంపీ, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ భార్య ప్రణీత్ కౌర్ కూడా ఉన్నారు. ఇక, లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీలో మొత్తం 15 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. వారిలో బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు ఉన్నారు. బీఎస్పీ, శివసేన, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, జేడీయూ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

Read Also: TTD: హాట్‌ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయం.. నిమిషాల వ్యవధిలోనే పూర్తి

అయితే, పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ.. అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగారని.. అందుకోసం వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు తీసుకుందని మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేశారు. ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకుందని.. వారు దుబాయ్ కేంద్రంగా లాగిన్ అయ్యారని నిషికాంత్ దూబే వెల్లడించారు. ఈ ఆరోపణలపై స్పీకర్ ఓంబిర్లాతో పాటు ఐటీ శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ లకు దూబే లేఖలు రాశారు.

Read Also: Marriages: ఏంట్రా బాబు.. ఆ ఊళ్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు..

మరోవైపు దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెల్ ముందు ఈ ఆరోపణపై అఫిడవిట్ దాఖలు చేశారు. తన నుంచి మహువా మోయిత్రా గిఫ్టులు, ఇతర సహాయాలు తీసుకుందని దాంట్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఎథిక్స్ ప్యానెల్ కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, ఐటీ మంత్రిత్వశాఖల నుంచి నివేదికలు తెప్పించుకుని మహువా మోయిత్రాను విచారించింది. ఇక, ఇవాళ మహువా మోయిత్రాపై లోక్ సభ స్పీకర్ కు ఎథిక్స్ కమిటీ నివేదిక అందించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఆమెపై వేటు వేస్తే టీఎంసీ ఎలా స్పందిస్తు్ంది అనేది వేచి చూడాలి.