Site icon NTV Telugu

Etela Rajender: తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందే పార్టీ బీజేపీనే

Etela

Etela

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కమలం పార్టీలోకి విశ్వకర్మ సంఘం నేతలతో పాటు జహీరాబాద్ కు చెందిన వివిధ పార్టీల నేతలు జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కింది స్థాయి నేతలు బీజేపీలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. జహీరాబాద్, పటాన్ చేర్వు, సంగారెడ్డి, నారాయణ్ ఖెడ్ ల నుంచి చాలా మంది పార్టీ లో జాయిన్ కాబోతున్నారు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు.

Read Also: India vs Pakistan LIVE Score, Asia Cup 2023: హార్ధిక్ పాండ్యా(87) ఔట్.. ఆరు వికెట్లు డౌన్

బీజేపీ పార్టీలో మాజీ ఎంపీపీలు, పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు స్థానికంగా సభలు పెట్టీ జాయిన్ కానున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. మీడియాలో కన్ఫ్యూజ్ చేసే వార్తలు రాస్తున్నారు.. కన్ఫర్మ్ చేసుకుని రాయండి అంటూ ఆయన సెటైర్ వేశాడు. బీజేపీ కమిట్మెంట్ తో ఉంది.. ఎట్లా పార్టీనీ గెలిపించుకోవాలనేదే మా ఆలోచన.. కాంగ్రెస్ ను కృత్రిమంగా లేపే ప్రయత్నం చేస్తున్నారు.. కింద ఎక్కడ ఆ పార్టీ లేదు.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందే పార్టీ బీజేపీనే అంటూ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

Read Also: Raghunandan Rao: గజ్వేల్ అభివృద్ధిని చూద్దామని వెళ్తే అరెస్ట్ లు చేస్తారా..?

బీజేపీ పార్టీలో అంతర్గత పోరు నడుస్తుందని వాస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈటెల రాజేందర్ తెలిపారు. బీజేపీపై కావాలనే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. మీడియా సంస్థలు నిజనిజాలు తెలుసుకుని వార్తలు రాస్తే బాగుంటుంది అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సారి తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

Exit mobile version