NTV Telugu Site icon

Etela Rajender : నేడు హజురాబాద్ నుంచి ఈటల ఎన్నికల శంఖారావం

Etela

Etela

కరీంనగర్ జిల్లా హజురాబాద్‌లో ఎన్నికల శంఖారావంను ప్రారంభించనున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఉదయం 8 గంటలకు జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఉదయం 10:00 లకు కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజల్లో పాల్గొంటారు. అక్కడి నుండి బైక్ ర్యాలీ ద్వారా కన్నూరు క్రాస్ రోడ్ లోని ఉమామహేశ్వర గార్డెన్ కు చేరుకుని బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. నిన్న ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. బడుగులకు అధికారం రాకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారని మండిపడ్డారు. మాటలు చెప్పి దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. గిరిజన, ఆదివాసీ బిడ్డలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.

Also Read : Ajay Bhupathi : సిద్దార్థ్, అదితి రావ్ రిలేషన్ పై ఆసక్తికర ట్వీట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి..

అందరినీ మోసం చేసి ఆయన కుటుంబం తెలంగాణను పాలిస్తోందన్నారు. బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారని.. బీసీలు అంటే కేసీఆర్‌కు చిన్న చూపు, చులకనా అంటూ వ్యాఖ్యలు చేశారు. దేశానికి బీసీని ప్రధాని చేసింది బీజేపీ అని చెప్పుకొచ్చారు. దళిత, మైనారిటీ, గిరిజన బిడ్డలను దేశ రాష్ట్రపతిని చేసింది బీజేపీ మాత్రమే అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో అణగారిన వర్గాలను కాంగ్రెస్ చిన్న చూపు చూసిందని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ఎంత మందికి టికెట్‌కు ఇచ్చారో చూశామన్నారు. బీజేపీ మాత్రం బీసీలకు 40 టికెట్‌లను కేటాయించబోతోందని తెలిపారు. కాబట్టి బీజేపీకి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Also Read : Rajarajeshwar Elderly Welfare Association: ఒక్కరితో మొదలై నేడు వందకు చేరువై.. ఆపదలో ఉన్న వృద్ధులకు అండగా ‘రాజరాజేశ్వర’