NTV Telugu Site icon

Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా..

Etela

Etela

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఈటల రాజేందర్, జమున దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఎన్నికల ప్రచారాన్ని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా.. అందు కోసమే హుజురాబాద్, గజ్వేల్ లో పోటి చేస్తున్నాను తెలిపారు. కేసీఆర్ మధ్యం, డబ్బు సంచులను నమ్ముకున్నాడు.. హుజురాబాద్ లో ఎమ్మెల్యే ప్రోటో కాల్ విస్మరించారు అని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు ప్రతిపక్ష, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సంప్రదాయ పద్దతిలో ఉండేవారు.. చిల్లర పనులకు ఈటెల కుంగిపోడు అని పేర్కొన్నారు.

Read also: NCP MLA Home: ఎన్‌సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన నిరసనకారులు

గజ్వేల్ లో సభ పెడితే లక్షల మంది ప్రజలు వచ్చారు అని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలు రాకుండా అనేక రకాలుగా అడ్డుపడ్డారు.. గజ్వేల్ ర్యాలీ చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.. ఎన్నడు కలువని గజ్వేల్ కార్యకర్తలను కేసీఆర్ కలిసిండు.. మీటింగ్ పెట్టి దావతులు ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. గుడుంబా బంద్ పెట్టి, వాడ వాడకు బెల్ట్ షాపులు తెరిచాడు.. తెలంగాణ ప్రజలను మధ్యానికి బానిసలు చేసి ఏటా 45 వేల కోట్ల రూపాయలు గుంజుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు నాగారం, బతివానిపల్లె గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాలు కలిసి వచ్చాయి.. ఎన్ని సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన విజయానికి డోకా లేదు.. ఈ సారి కూడా గ్రామ ప్రజలు ఆశీర్వాదించాలని కోరుతున్నాను అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.