NTV Telugu Site icon

Etela Rajender: మంచి ఎవ్వరో.. చెడు ఎవ్వరో తెలుసుకుని ఓటు వేయాలి..

Etela

Etela

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం క్లబ్లోని ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫ్లెయింగ్ స్కాడ్ పేరుతో తమకు ఇబ్బందులు గురిచేయాలని చూశారని ఆరోపించారు. లక్ష కోట్ల యజమాని అయిన గుడిసెల్లో ఉన్న వారికైనా ఒకటే ఆయుధం ఓటు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తూట తిన్నది ఇక్కడి ప్రజలేనని.. ఈ జిల్లా పెద్ద చైతన్య వంతమైన జిల్లా అని పేర్కొన్నారు. ఈ సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న గ్రాడ్యుయేట్ ఓట్లు అని.. అందుకే మంచి ఎవ్వరో చెడు ఎవ్వరో తెలుసుకుని ఓటు వేయాలని ఈటల సూచించారు.

Ap Weather: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

మరోవైపు.. ఆరు నెలల ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం వచ్చిందా.. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ జుట్లో పుట్టినట్లు ఉందని ఈటల రాజేందర్ విమర్శించారు. తాను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి హామీలు కానీ హామలు సాధ్యం కాదు అని చెప్పానని.. ఆయన వినలేదని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న భూములు అమ్మినా.. గత ప్రభుత్వంలో హామీలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఈటల పేర్కొన్నారు. ఈ తెలంగాణలో అర్ధరాత్రి మద్యం దోరుకుద్ది.. కానీ ఒక టాబ్లెట్ దొరకదు అని ఆరోపించారు. తాగిస్తారు ప్రక్కనే కేసులు పెడతారు.. ఈ ప్రభుత్వానికి రెండు విధాలు ఆదాయం అని తెలిపారు. నెంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ 1వ తారీఖు లోపు జీతాలు ఇవ్వలేక పోయారు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని ఈటల చెప్పారు.

Gang War: హాలీవుడ్ తరహాలో గ్యాంగ్‌వార్.. వీడియో వైరల్

ప్రతి హామీలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమేనని అన్నారు. గత ప్రభుత్వం లో 8000 మంది మున్సిపల్ కార్మికులను డిస్మిస్ చేశారు.. స్వేచ్ఛా భారత్ తెచ్చి 12వేల కోట్ల టాయిలెట్ కట్టించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే తెచ్చింది నరేంద్రమోడీనేనని.. 10 సంవత్సరాల పరిపాలనలో కొన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మించింది బీజేపీనేనని అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తెచ్చి.. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఘనత మోడీదేనని ఈటల తెలిపారు. భారతదేశంలో నరేంద్రమోడీ హాయాంలో తయారు కానీ ఉత్పత్తి ఉందా.. అన్ని రంగాలను అభివృద్ధి చేసింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నేడు దేశంలో ఎక్కడా బాంబుల మోతలు లేవు.. స్కాంలు, దందాలు లేని పార్టీ
పార్టీ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.