Site icon NTV Telugu

Etela Rajender : ఓరుగల్లు మొదటి నుంచి చైతన్యానికి మారు పేరుగా నిలుస్తుంది

Etela Rajender

Etela Rajender

బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ లో తెలంగాణ లో బీసీలకు రాజ్యాధికారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా ఆత్మగౌరవాన్ని నా సొంత ఆలోచనలను వంచన చేసే ఏ పదవులు అయిన నాకు గడ్డిపోసతో సమానమన్నారు. ఓరుగల్లు మొదటి నుంచి చైతన్యానికి మారు పేరుగా నిలుస్తుందని, నాటి నుంచి నేటి వరకు బీసీలు రాజ్యాధికారం కు నోచుకోలేదన్నారు. చైతన్య వంతమైన గడ్డ మీద మనం ఉన్న ఐక్యత సాధించలేక పోతున్నామని, అట్టడు వర్గాల నుంచి రాజ్యాధికారం సాధించిన రాష్ట్రం బీహార్ అని ఆయన వెల్లడించారు. అవకాశం వస్తే శక్తి సత్తా చాటగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళం బలహీన వర్గాల ప్రజలం అని ఆయన అన్నారు. నూటికి నూరు శాతం అణగారిన వర్గాలకు చెందిన రాష్ట్రం తెలంగాణ అని, అందుకే ఉద్యమ సమయంలో దళితుడు మొదటి ముఖ్యమంత్రి అన్ని కేసీఆర్‌ ప్రకటించారన్నారు. కానీ అధికారం దగ్గరకు వచ్చిన తరువాత కేసీఆర్‌ ఎలా వ్యవహరించారు. ఏలా మాట తప్పారో తెలంగాణ సమాజం చూసిందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘ బీసీల్లో ఐక్యత రానంతవరకు రాజ్యాధికారంకు మనం దూరం అవుతాం. ఐక్యత లోపించినంత కాలం అధికారంకు మనం దూరం అవుతాం, రాజ్యాంగం సాక్షిగా మన కండ్లలో మన్ను కొట్టబడుతుంది.

Also Read : Imran Khan: నన్ను చంపాలని చూస్తున్నారన్న ఇమ్రాన్.. 8 రోజులు రిమాండ్ విధించిన కోర్టు..

రిజర్వేషన్ ను చూపుతూ అణగారిన వర్గాల ప్రజలను చిన్నచూపు చూసిన రోజులు. రాజ్యాధికారం మనకు తెలియకుండానే మన నుంచి జారిపోయింది. మన అప్రమత్తత లోపించడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చింది. డబ్బులు లేకుండ పోటీ చేస్తే సపోర్ట్ చేసే పరిస్థితి లేకుండ చేశారు. చైతన్యం చంపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరగాలి. చైతన్యం రావాలి అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజల్లో చైతన్యం బతికే ఉంది అనడానికి నిదర్శనం హుజూరాబాద్ నియోజక వర్గం ఉప ఎన్నికలు. ఎన్నికల కమిషన్ ఉన్న సరిగా పని చేయకున్న ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించారు. ప్రజా ప్రతినిధులను మార్కెట్ లో వస్తువుల్లా కొనుగోలు చేసిన హుజూరాబాద్ ప్రజలు తమ ఆత్మను ఆవిష్కరించారు. ఈ ఫలితాలు రాష్ట్రం మొత్తం ఆవిష్కారం కావాలి. యుద్ధం అంటూ జరిగితే విజయం సాధించే సత్తా మనకు ఉన్నదని నిరూపించే సమయం ఆసన్నం అవుతుంది. త్యాగాలు చేసిన వారు అందరూ అణగారిన వర్గాలకు చెందిన వారే. నీ చేతిలో ఉన్న అధికారం దుర్వినియోగం చేసుకోవద్దు. ఉద్యోగాలు సాధించేందుకు ఉన్నట్టు రాజకీయాల్లో మెరిట్ తప్పకుండా ఉండాలి. ఆ మెరిట్ సేవ చేసే గుణంలో మెరిట్ ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే మెరిట్ ఉన్న వారే పాలకులు కావాలి. రాజ్యాంగం పై పట్టు అంబేద్కర్ ఆశయ సాధనకోసం పని చేసే మనసున్న వారు పాలకులు కావాలి. అటువంటి నాయకులను ఎన్నుకునే సోయి ప్రజలకు రావాలి. అప్పుడే అంబేద్కర్ కలలు కన్న సమాజం ఆవిష్కృతం అవుతుంది.’ అని ఆయన అన్నారు.

Also Read : Andhra Pradesh: రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు ఖాతాల్లో జమ..

Exit mobile version