NTV Telugu Site icon

Etela Rajender : కేసీఆర్‌ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయం

Etela Rajender

Etela Rajender

కొత్త సచివాలయం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మూడు, నాలుగు నెలలపాటు రోజు ఆఫీస్ కి వస్తారా.. అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ ఇవాళ మాట్లాడుతూ.. ఇతర నాయకుల ఆనవాళ్ళు లేకుండా చేయడానికే కొత్త సచివాలయమని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయమని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిది సంవత్సరాలుగా పాలన అస్తవ్యస్తం అయ్యింది. వ్యవస్థలు చట్టుబండలు అయ్యాయని, కొత్త సచివాలయంలో అయినా పాలన బాగుపడాలి అని ఆశిస్తున్నామన్నారు. చరిత్రలో తానే గొప్పవాడిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాడని చెప్పారు. సచివాలయాన్ని కట్టడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఆయన ప్రతిష్ఠ కోసం, ఆయన పేరు కోసం దీనిని కట్టినట్లుగా భావిస్తున్నానని చెప్పారననారు.

Also Read : MI Vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టారు, దాని వెనుక ఏమి ఉన్నదనే విషయం గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. కానీ తన డిమాండ్ ఒక్కటేనని, గతంలో ఎప్పుడూ సచివాలయానికి లేదా ఆఫీస్ కు రాని ముఖ్యమంత్రి, కనీసం ఇప్పుడు కొత్త సచివాలయం కట్టిన తర్వాత అయినా ఆయన వస్తాడని భావిస్తున్నానని చెప్పారు. సచివాలయానికి వచ్చి, ప్రజలను కలుస్తాడని తాను ఆశిస్తున్నానని ఈటల అన్నారు. సచివాలయంలో సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ప్రజల సందర్శన కోసం తెరిచే సౌకర్యం ఉండేదని, ఇప్పుడు అది నిలిచిపోయిందన్నారు. కేసీఆర్ ఈ తొమ్మిదేళ్లలో ప్రజల్ని, అధికారులను… ఇలా ఎవరినీ కలవలేదన్నారు. ఏ మంత్రి ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.

Also Read : Viral Video : ఫన్నీ రోడ్ యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో..!