Site icon NTV Telugu

Etela Rajender : రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి

Etela

Etela

రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్ళు అని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు, నేతలు… ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని రేవంత్ గతంలో చెప్పిన మాటల వీడియోను చూపిన ఈటల రాజేందర్‌.. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలన్నారు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడతారని, విశ్వసనీయత లేని పార్టీలను ప్రజలు బొంద పెడతారని, తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారన్నారు ఈటల రాజేందర్‌. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదని, మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరని, ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదన్నారు ఈటల రాజేందర్‌.

పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదని, 69 లక్షల మంది రైతులకు నిరాశ ఎదురవుతోందన్నారు ఈటల రాజేందర్‌. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు ఎగనామం పెట్టినట్లే అని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతులకు కూడా రుణమాఫీ చేయడం లేదన్నారు. రుణ మాఫీ చేస్తానని రేవంత్ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారని, రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ ఉండదని నిబంధనలు పెట్టారన్నారు ఈటల రాజేందర్‌. 34 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్… నిబంధనల పేరిట రైతులకు సున్నం పెడుతున్నారని, వరి ధాన్యంకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారన్నారు ఈటల రాజేందర్‌ అన్నారు.

రైతులను మోసం చేసిన రాజ్యం బాగుపడదని, రైతుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తప్పవని, పిట్టల దొరలా రేవంత్ మాట్లాడారు.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు ఈటల రాజేందర్‌. ప్రజలను దండుకోవడం తప్పా.. పరిపాలన చేయడం లేదని, కాంగ్రెస్ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానమన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో రేవంత్ రెడ్డి… కెసిఅర్ జుట్ల ఉన్నారని, అప్పుల పేరిట.. శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారన్నారని ఆయన మండ్డిపడ్డారు. 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న దొమ్మరోళ్ళ, బిచ్చగాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఈటల ధ్వజమెత్తారు.

Exit mobile version