NTV Telugu Site icon

Etela Rajender : ఏదిపడితే అది చెప్పి తప్పించుకుంట.. అంటే ప్రజలు నీ భరతం పడతారు…

Etela

Etela

సీఎం రేవంత్‌ బిల్డింగ్ పర్మిషన్ కి SFT కి 75 రూపాయలు వసూలు చేస్తున్నారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఇవాళ నల్లగొండలో ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయలేరని, ఏదిపడితే అది చెప్పి తప్పించుకుంట అంటే ప్రజలు నీ భరతం పడతారని ఆయన వ్యాఖ్యానించారు. అతి తక్కువ కాలంలో ప్రజలచేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. కమీషన్ల దుకాణాలు ఓపెన్ చేశారని, ప్రభుత్వపరమైన ఆదాయాన్ని పెంచేదానికంటే వాళ్ళ ఆదాయం ఎలా పెంచుకోవాలో ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఎస్.ఎఫ్.టి కి 75 రూపాయలు వసూలు చేయాలని ఫిక్స్ అయిందని.. రైట్ రాయల్ ట్యాక్స్ లెక్క.. ముగ్గురు మనుషులని పెట్టి వారు చెప్తేనే పర్మిషన్ ఇచ్చేటట్లుగా.. ఆ ముగ్గురికి డబ్బులు చెల్లించాలని నిర్ణయం జరిగినట్టు తెలుస్తుందన్నారు.

అంతేకాకుండా..’పెరుగుట విరుగుట కొరకైనట్లు కేసీఆర్ కూడా ఇలానే చేసి ఖతమయ్యారు. కెసిఆర్ జుట్టులో నుంచి పుట్టిన అంటే ఏదో అనుకున్నాం.. రేవంత్ రెడ్డి ఇదేనా నువ్వు చేసే పని. పోయేకాలం ఇలానే ఉంటుంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేసింది రేవంత్ రెడ్డి నే. రిజిస్ట్రేషన్ ఆదాయం కోసం భూముల రేట్లు పెంచాలనే ఆలోచన సరి అయినది కాదు. ప్రధానమంత్రి, హోంమంత్రి ఇక్కడికి వచ్చి తెలంగాణలో డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేయబడుతుంది.. 360 డిగ్రీస్ లో పరిశీలన చేస్తున్నాం కేర్ ఫుల్ గా ఉండండి అని ఇప్పటికే హెచ్చరికలు చేసి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని, పాత స్వభావాన్ని మళ్లీ ప్రదర్శిస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయడం దేవుడు ఎరుగు.. మహిళలకు 2500 రూపాయల ఊసేలేదు. నాలుగువేల పెన్షన్ మాటే లేదు.

రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానన్న తన మాట విశ్వసించరని దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి చెప్తున్నారు. రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేక అభాసు పాలైనారని అసహ్యించుకుంటున్నారు. బిల్డింగ్ ల కోసం, భూముల విషయంలో ఇచ్చిన రిలాక్షేశన్ విషయంలో పాతవారిని మళ్లీ పిలిపించుకొని పాత ప్రభుత్వం 100 రూపాయలు వసూలు చేస్తే ఈయన 200 రూపాయలు వసూలు చేస్తూ.. డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది ఇప్పటివరకు ఒక అనుమతి ఇవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ప్రభుత్వ ఆదాయ వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. తెలంగాణ ఆర్థిక ప్రగతి పురోగమనంలో కాకుండా మందగించిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఏది. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీని నిలదీసే శక్తి ఒక్క బిజెపికి మాత్రమే ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరుల కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. సర్పంచులు చేసిన పనులకు, కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు రావడం లేదు. 10% లంచాలు ఇస్తే తప్ప బిల్లులు రాని పరిస్థితి ఉంది.

డబ్బులు తప్ప వేరే పని లేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వారు దుకాణాలు ఓపెన్ చేశారు. పది సంవత్సరాల కరువు ఒకేసారి నింపుకునేలా పోటీపడుతున్నట్లు కనిపిస్తున్నారు. పంటలు ఎండిపోయినయ్ మోటర్లు, ట్రాన్స్ఫర్మర్లు కాలిపోతున్నాయి అయినా వాటిని పట్టించుకోవడం లేదు. 500 బోనస్ దేవుడు ఎరుగు.. 40 కిలోల బస్థాకి నాలుగు కేజీలు కటింగ్ పెడుతున్నారు. వారి సొంత పనులు తప్ప రైతులకు మహిళలకు ఏం జరుగుతుందో చూసే నాధుడే లేడు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాము. బాధ్యత కలిగిన పౌరులుగా పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాను. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించని, సర్వేసంస్థలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు దేశరక్షణ, అంతరంగిక భద్రత, పురోగమనం, ప్రతిష్ట ఔన్నత్యం ఇవన్నీ ఉండాలంటే మోడీ గారే ప్రధాని కావాలని కృత నిశ్చయంతో టెలిపతి పద్ధతిలో ఒకరికి ఒకరు చెప్పుకొని ప్రజలు ఓట్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా యువకులు, చదువుకున్న వారు సంపూర్ణంగా బిజెపిని ఆశీర్వదించి గెలిపిస్తారని విశ్వాసం ఉంది.’ అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.