Site icon NTV Telugu

Etela Rajender : అధికార పార్టీ డబ్బులతో ప్రలోభాలు పెట్టింది

Etela Rajender

Etela Rajender

రాష్ట్రంలో బీజేపీ నాయకులను గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్. ఇవాళ ఆయన బీజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉండాలని మమ్మల్ని గెలిపించారన్నారు. అనూహ్యంగా 35 శాతానికి పెరిగిన ఓటు బ్యాంక్ పెరిగిందని, అధికార పార్టీ డబ్బులతో ప్రలోభాలు పెట్టిందని, అయినా వారికి ఓటు బ్యాంక్ పెరగలేదన్నారు ఈటల రాజేందర్‌. ఈ ఎన్నికలు ఫలితాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారం అనే స్పష్టత వచ్చిందని ఆయన తెలిపారు. ఆరు నెలల్లో ప్రజలతో చీ కొట్టించుకున్న సీఎం రేవంత్ అని, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ లను ప్రతిష్టాత్మకంగా సీఎం తపుకున్నారన్నారు. అయినా ప్రజలు ఆయనను బంగపాటుకు గురి చేశారని, ఏ స్థానం ఎవరి జాగీరు కాదన్నారు ఈటల రాజేందర్‌.

అంతేకాకుండా..’ఓటమి గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. గెలిచిన వాళ్ళంతా చాలా అనుభవజ్ఞులు. కాంగ్రెస్ హామీల అమలుకు పొరడతాం. నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ పీఠం ఎక్కనున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అందరం కలిసి కట్టుగా పని చేస్తాం. ఆప్ కీ బార్ చారుసావు పార్ ప్రజలు ఇచ్చిన నినాదం. మేము పెట్టిన నినాదం కాదు. గెలిచిన స్థానాలు వదిలేస్తే ఖమ్మం, మహబూబాబాద్ తప్ప మిగతా స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచాం. మా కూటమికి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదం. మేము ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడతమని ఎక్కడ చెప్పలేం. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలే బండకేసి కొడుతారు.’ అని ఈటల వ్యాఖ్యానించారు.

Exit mobile version