Etela Rajender challenged to congress MLA.
తెలంగాణలో ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఎమ్మెల్య ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. రోషం ఉన్న బిడ్డ కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. మీ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని కోరాలి. బై ఎలక్షన్ రావాలంటే దమ్ముఉండాలి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన 5 నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదించారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు, ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా టీఆర్‌ఎస్‌లో చేరారు. కొంతమంది మంత్రి పదవులు కూడా ఎలగబెడుతున్నారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే బైక్ ర్యాలీ లు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజీనామా చేయకుండా వున్నారు..12 మంది పార్టీ మారినప్పుడు రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో గెలిచి కొందరు మంత్రిగా వెలగబెడుతున్నారు. రాజగోపాల్ రాజీనామాతో పది లక్షల మంది పెన్షన్ ప్రకటించారు. నైతికత ఉండాలి.. ఇతర పార్టీలోకి వెళ్లాలంటే రాజీనామా చేయాలి. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి రావాలి. చేరికలు ఒక రోజుతో ఆగిపోయేవి కావు. ఇక కొనసాగుతూనే ఉంటాయి. భవిష్యత్ అంత బీజేపీది.. కుప్పలుకుప్పలుగా జాయిన్ అవుతారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో జాయిన్ అవుతున్నారు అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.