సీఎం కేసీఆర్‌ని ఓడించడానికి జనం సిద్ధం అయ్యారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో పేదల నుంచి భూములు లాక్కుని ప్రయివేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తిన వారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా గజ్వేల్ ఎన్నికలు జరగాలన్నారు. మీ బెదిరింపులు, ప్రలోభాలు, డబ్బు సంచులు ఇస్తే హుజురాబాద్ లో జరిగిన సీనే రిపీట్ అవుతుందన్నారు. గజ్వేల్ ప్రజలు సీఎం కేసీఆర్ ని కసితో ఒడిస్తారన్నారు. పొరపాటున సీఎం కేసీఆర్ గెలిస్తే ఒంటిపై ఉన్న బట్టలు కూడా మిగలవు అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వేకి అందని ఫలితం గజ్వేల్ లో రాబోతుందన్నారు ఈటల.
Also Read : Manchu Manoj: నేను ఆ పని చేస్తే.. ఆళ్లగడ్డ నుంచి బాంబ్ లు పడతాయి
ఉద్యోగ నోటిఫికేషన్లు రాక.. నిరుద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరు మీద లాక్కున్న భూములకు ఇంతవరకు పరిహారం అందించలేదని ఈటల అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ప్రైవేటు కంపెనీల కోం పేదల భూములు లాక్కొన్ని కేసీఆర్ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోంది. ప్రాజెక్టుల వద్ద టూరిజం పేరుతో మళ్లి భూముల్ని లాక్కుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే లాక్కున్న భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాం. రైతుల నుంచి భూముల్ని లాక్కుని అందులో వారినే కూలీలుగా మారుస్తున్నారు.మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తానని వారి కోసం కంపెనీలు ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోలేదు. కేసీఆర్ ను మళ్లీ గెలిపిస్తే ప్రజల బతుకులు ఆగం అవుతాయి” అని ఈటల హెచ్చరించారు.
Also Read : Mahadev App case: “కొన్ని రోజులు దుబాయ్ వెళ్లమని సీఎం బఘేల్ సలహా ఇచ్చాడు”.. బెట్టింగ్ యాప్ ఓనర్ సంచలనం..