Etela Rajender: తిరిగి టీఆర్‌ఎస్‌లోకి.. స్పందించిన ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి గులాబీ గూటికి చేరతారనే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ గులాబీ కండువా కప్పుకుంటారని, ‘ఘర్ వాపసీ’ అంటూ ఈటల ఫొటోతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతుండగా.. ఈ ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. తాను పార్టీ మారడం లేదని ఖరాకండిగా చెప్పేశారు. బీజేపీ నుంచి తాను తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని, తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా పుకారే అని కొట్టి పారేశారు. ఇదంతా పచ్చి అబద్ధమని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శించారు.
Harish Rao: శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స కేంద్రం.. ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
టీఆర్ఎస్ మొదట్నుంచి ఉన్న తనను కేసీఆర్ మోసం చేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో తాను 20 ఏళ్లు పని చేశానని.. 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయినా తాను మాత్రం పార్టీని వీడలేదని ఈటల అన్నారు. టీఆర్ఎస్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా తాను పార్టీ మారలేదని తెలిపారు. పదవుల కోసం తాపత్రయపడే వ్యక్తినే అయితే రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడే మంత్రిని అయ్యేవాడినన్నారు. టీఆర్ఎస్ (TRS) నుంచి నేను వెళ్లిపోలేదు.. కేసీఆరే వెళ్లగొట్టారని ఆరోపించారు. ఎంత అవమానించినా బయటకు చెప్పుకోలేదన్నారు. భూకబ్జాదారుడు, అవినీతి పరుడని తనపై ఆరోపణలు చేశారని చెప్పారు. పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అంకితభావం ఎలాంటిదో అందరి కంటే కేసీఆర్‌కే ఎక్కువ తెలుసని ఈటల పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. 2015 నుంచి ఆ పార్టీలో, ప్రభుత్వంలో తాను ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈటల తెలిపారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!