NTV Telugu Site icon

చుక్కల్లో నిత్యావసర ధరలు.. అక్కడ కిలో పిండి 2,400.. 25 కిలోల బియ్యం 2,700

ఆప్ఘనిస్తాన్‌లో నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ విలువ రోజురోజుకు పడిపోతుండటమే అక్కడ నిత్యావసర ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏ వస్తువు ధర చూసినా గుండె గుభేల్ అంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలు అయితే నిత్యావసరాలను కొనుగోలు చేయలేక ఉన్న డబ్బులతో ఒకపూట తిని ఒక పూట పస్తులు ఉంటున్నారు.

Read Also: ఆకాశాన్నంటిన మునగాకాయ ధరలు

ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ దేశంలో కిలో పిండి 2,400 ఆఫ్ఘనీలు పలుకుతోంది. అదేవిధంగా 16 లీట‌ర్ల నూనె 2,800 ఆఫ్ఘనీలుగా ఉంది. ఇక 25 కిలోల బియ్యం బ్యాగ్ అయితే 2,700 ఆఫ్ఘనీలుగా పలుకుతోంది. కూలీ పనులకు వెళ్లి రోజుకు 100 ఆఫ్ఘనీలు ఆర్జించే పేద‌లు వారు సంపాదించింది తిండికి కూడా స‌రిపోవ‌డం లేదు. కాగా ఆఫ్ఘనిస్తాన్‌లో విరివిగా పండే ఉల్లి ధ‌ర మాత్ర కేవ‌లం 30 ఆఫ్ఘనీలు పలుకుతుండటం గమనార్హం. మన దేశంలో మాత్రం కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.50 మధ్య పలుకుతోంది.