ESIC Jobs: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-II (IMO Gr.-II) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2025. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో మొత్తం 608 పోస్టులను భర్తీ చేస్తారు.
Also Read: IMD 150 Years: నేటితో భారత వాతావరణ విభాగంకి 150 ఏళ్లు
ఇక పోస్టుల విషయానికి వస్తే.. జనరల్ కింద 254 పోస్టులు, షెడ్యూల్డ్ కులం (SC) కింద 63 పోస్టులు, షెడ్యూల్డ్ తెగకు 53 పోస్టులు, ఇతర వెనుకబడిన తరగతులకు 178 పోస్టులు, EWS 60 పోస్టులు, PWBD(C) 28 పోస్టులు, PWBD(D&E) – 62 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక ఈ ఉద్యోగాలకు విద్యా అర్హత చూస్తే.. అభ్యర్థి తప్పనిసరిగా MBBS డిగ్రీని కలిగి ఉండాలి. దీనితో పాటు తప్పనిసరిగా భ్రమణ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. 2022, 2023 కోసం CMSE జాబితాలో కనిపించే అభ్యర్థులు మాత్రమే ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయో పరిమితి విషయానికి వస్తే.. గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరలుగా నిర్ణయించారు. SC, ST, OBC, PWD, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది.
Also Read: Non Veg Markets Full Busy: కనుమ ఎఫెక్ట్.. రద్దీగా మారిన నాన్ వెజ్ మార్కెట్లు..
ఇక ఈ ఉద్యోగాలకు జీతం చూస్తే.. పే స్కేల్ లెవెల్-10 కింద జీతం ఇవ్వబడుతుంది. జీతం రూ. 56,100 – రూ. 1,77,500 వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ CMSE 2022, CMSE 2023 లో వెలుబడిన జాబితాల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. అర్హత గల అభ్యర్థులు మెడికల్ ఆఫీసర్ (IMO) గ్రేడ్-II పోస్ట్ కోసం ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడతారు. CMSE-22, CMSE-23 పరీక్షల మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. అభ్యర్థులు మెరిట్ జాబితాలోని స్థానం ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్ ద్వారా www.esic.nic.in/recruitments అప్లై చేసుకోండి.