NTV Telugu Site icon

Bhatti Vikramarka : ఎర్రుపాలెంలో బీఆర్ఎస్ కు షాక్.. భట్టి సమక్షంలో కాంగ్రెస్‌లోకి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఎర్రుపాలెం మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మండలంలోని బనిగండ్లపాడు, బుచ్చి రెడ్డి పాలెంలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యింది. ఆ గ్రామం సర్పంచ్ లు జంగా పుల్లా రెడ్డి, యరమల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండి రామకృష్ణ, సొసైటీ అధ్యక్షుడు అక్కిరెడ్డి, గుజ్జుల వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మి, శీలం వెంకట్ రెడ్డి, ఎదురు రామచంద్ర రెడ్డిల ఆధ్వర్యంలో 200 కుటుంబాలు బీఆర్ఎస్, సీపీఎం పార్టీలకు రాజీనామా చేసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఇదిలా ఉంటే..విలువలతో కూడిన రాజకీయాలు చేసి మధిర ప్రతిష్టను, ఓట్లు వేసి గెలిపించిన ప్రజల గౌరవాన్ని తలెత్తుకునేలా నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లును ఈ ఎన్నికల్లో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తున్నదని రాబోయే ప్రభుత్వంలో కీలక భూమికగా మారనున్న భట్టి విక్రమార్క వల్ల మధిర నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కావడంతో పాటు ప్రజలకు సంక్షేమం, మరిన్ని ప్రయోజనాలు అందుతాయన్న నమ్మకంతోనే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా భట్టి విక్రమార్కకు మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. తెలుగుదేశం కాంగ్రెస్, సిపిఐ, వైయస్సార్ టిపి శ్రేణులు సమన్వయంతో కలిసి పని చేసి మధిర అభివృద్ధి కోసం భట్టి విక్రమార్కను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు. మధిర నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని రాష్ట్ర పార్టీ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఎన్నికలు జరగబోయే 15 రోజుల వరకు అవిశ్రాంతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం సైనికుల వలె పని చేసి తెలుగుదేశం పార్టీ సత్తాను మరోసారి నిరూపించాలని కోరారు.

Show comments