Site icon NTV Telugu

Erracheera: యదార్థ సంఘటన ఆధారంగా.. ‘ఎర్రచీర – ది బిగినింగ్’

Erracheera

Erracheera

Erracheera: బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను పోషించారు.

READ ALSO: Adani Group: అదానీకి ఆనందం.. నిమిషాల్లో లక్ష కోట్లు పెరిగిన కంపెనీ లాభం!

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. ఎర్రచీర – ది బిగినింగ్ ఒక విలక్షణమైన కథాంశంతో రూపొందిన సినిమా అని, మదర్ సెంటిమెంట్‌కు హారర్, యాక్షన్ అంశాలు బలంగా మిళితమయ్యాయని తెలిపారు. ముఖ్యంగా సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని సెన్సార్ టీమ్ అభిప్రాయపడినట్లు వెల్లడించారు. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించామని అన్నారు. చింతల్ ప్రాంతంలో నా స్నేహితుడి ఇంటి పక్కన జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నట్లు తెలిపారు. ఇందులో కేవలం 20% మాత్రమే వాస్తవ కథ అని, మిగిలినది కల్పితం అని చెప్పారు. ఎర్రచీరకు సీక్వెల్‌గా అరకులో జరిగిన గిరిజన యదార్థ గాధతో ‘అంబిక (ఎర్రచీర-2)’ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

READ ALSO: Biker Release Date: శర్వా స్పీడ్ మామూలుగా లేదుగా! ‘బైకర్’ రిలీజ్ డేట్ లాక్..

Exit mobile version