Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం

Errabelli Dayakar

Errabelli Dayakar

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ముంపు బాధిత కుటుంబాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కలెక్టర్ ప్రావిణ్య పరిశీలించారు. ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. తక్షణసాయంగా బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కలెక్టర్ ప్రావిణ్య. తమను ఆదుకోవాలంటూ ముంపు బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని శాఖల అధికారులకు ఆదేశాలను ఇచ్చాము సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. దెబ్బతిన్న ఇండ్ల బాధితులకు గృహ లక్ష్మీ పథకం కింద ఇండ్లను మంజూరు చేస్తామని ఆయన అన్నారు.

Also Read : Jharkhand: సవతి కొడుకును హత్య చేసిన కసాయి తల్లి.. కారణమదే..!

పునరావాస కేంద్రాలకు తరలించి వసతి సౌకర్యం, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో ముంపు ప్రభావిత ప్రాంతాలపై మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య, నగర పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌, కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా పర్యటించి పరిస్థితి సమీక్షించారు. చిన్న వడ్డేపల్లి చెరువు, గరీబ్‌నగర్, మధురానగర్, ఎస్ఆర్‌నగర్, నాగేంద్ర నగర్, కీర్తి బార్ ఏరియా, డీకేనగర్, శాంతి నగర్, బొందివాగు నాలా, మైసయ్య నగర్, ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రస్తుత స్థితిగతులను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తూర్పాటి సులోచన సారయ్య, గుండేటి నరేందర్ కుమార్, ఓని స్వర్ణలత భాస్కర్, పోశాల పద్మ స్వామి, సిద్ధం రాజు, సోమిశెట్టి ప్రవీణ్ మరుపల్ల రవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read : Chiranjeevi: చిరంజీవిపై కేసు.. తొమ్మిదేళ్ల తరువాత కొట్టేసిన హైకోర్టు

Exit mobile version