NTV Telugu Site icon

Errabelli Dayakar Rao : కేంద్రం 100 అవార్డులు ఇస్తే 99 మన గ్రామాలకే

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

మా నాయనా కూడా 30 యేండ్లు సర్పంచ్ గా ఉన్నాడు. అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండే అందరికి తెలుసని అన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆనాడు నీళ్లకు ఎంత కష్టాలు ఉండే.. ఖాళీ బిందెలు ఎదురుగా వచ్చేవి మాకు గ్రామాల్లో అని ఆయన అన్నారు. సర్పంచ్ కు ఆనాడు మోటర్ కాలి పోయిందని, పైప్ లు పగిలాయని చెప్పేది. సీఎం కేసీఆర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకోని ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీరు ఇస్తున్నారు. ఇప్పుడు త్రాగు నీరు సమస్యలు ఎక్కడ లేవు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఇచ్చారు, వైకుంఠదామాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో చెత్తచెదరాంతో గ్రామాల్లో పెంట కుప్పలుగా ఉండేవి. ఇప్పుడు అలా ఎక్కడ కూడా లేదు. చిన్న గ్రామానికి కూడా ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. 99 శాతం ఉపాధి హామీ పథకంలో హరితహారం చెట్లకు నీళ్లు పోశారు. డబ్బులు సంపాదించారు వాటితో ట్రాక్టర్ కిస్తులు కట్టారు. గతంలో ఎవరు చేయని పనులు గ్రామాల్లో మీరు సర్పంచ్ లుగా ఉన్నప్పుడు అయ్యాయి. 15 ఆర్ధిక సంఘం నిధులు రాకుండా ఆపేసింది కేంద్ర ప్రభుత్వం.

Also Read : Mohan Bhagwat: భారత్ నుంచి ఎందుకు విడిపోయామా అని పాకిస్తాన్ ప్రజలు బాధపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసింది. గ్రామాల అభివృద్ధికి ఆటంకాలు కలుగేందుకు. కేంద్ర ప్రభుత్వంకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నిధులు వాడుకుంటుంది తప్ప తెలంగాణ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1430 కోట్లు మాత్రమే. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవార్డులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు ఇవ్వడం లేదు. ఆనాడు వంద అవార్డులు ఇస్తే ఒక్కటి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు 100 ఇస్తే 99 మన రాష్ట్రంలోని గ్రామాలకు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకంను వ్యవసాయరంగంకు అనుసంధానం చేయాలని సీఎం డిమాండ్ చేసిన అనుసంధానం చేయడం లేదు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అధికారులు పొగుడుతారు. కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిధులు ఇవ్వరు. రైతులు కల్లాలు కడితే కట్టవద్దు అంటున్నారు. అదే వాళ్ళ రాష్ట్రాల్లో చేపలకు కల్లాలు కడుతున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం లెక్క. పశ్చిమ బెంగాల్ తో పాటు 5,6 రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంను ఆపేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆపాలని చూస్తున్నారు. ఉపాధి హామీ పథకంకు అనేక కొర్రీలు పెడుతున్నారు. సర్పంచ్ లకు జీతాలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి. మళ్ళీ సీఎం కేసీఆర్ సర్పంచ్ ల జీతాలపై తీపి కబురు ఇస్తాడు.’ అని ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

Also Read : GT vs CSK : గుజరాత్‌ టైటాన్స్‌ లక్ష్యం 179.. రుతురాజ్ సెంచరీ మిస్‌

Show comments