Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : రేవంత్ రెడ్డి నీ జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు

Yerrabelli Dayakar Rao

Yerrabelli Dayakar Rao

పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ని జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు అని అన్నారు. గోడల మీద రాతలు రాసే వ్యక్తివి నీవు అని, నా తాత ముత్తాతల నుండి వేల ఎకరాలు నా ఆస్తి అని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక జోకర్, చంద్రబాబుతోనే స్వయంగా నేను చెప్పాను రేవంత్ రెడ్డి బ్రోకర్ అని అన్నారు.

అంతేకాకుండా.. ‘ఓటమి ఎరుగని నాయకున్ని నేను. గత ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. అమెరికా తానా సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తా అన్న వ్యక్తివి నీవు. తెలంగాణ ప్రజలు నీ బ్రోకర్ మాటలు నమ్మరు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే 10 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చారని అంటున్నారు. దందాలు చేసుడు ,బ్రోకరిజం బంజేయమని నీకు ఎప్పుడూ చెప్పే వ్యక్తిని నేను. నీ బతుకు హెలికాప్టర్ ఎక్కే రేంజ్ ఉందా. కరోనా టైంలో 2000 మంది పేషంట్లను బతికించా.

నా గురించి మాట్లాడాలి అంటే నీకు సిగ్గుండాలి. ఎమ్మెల్యేగా ,ఎంపీగా మంచి పేరు సంపాదించిన. చంద్రబాబుతో కలిసి నేను ధర్నా చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జి చేస్తుంటే తప్పించుకోని పోయిన వ్యక్తివి నీవు. పాలకుర్తి ప్రజలను తన్నిన వ్యక్తివి నీవు , కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా ఓట్లేస్తారు. రేవంత్ రెడ్డి పాలకుర్తి ప్రజలను తనితే , మనం ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీని తన్నాలి. చాకలి ఐలమ్మ , దొడ్డి కొమురయ్య లాగా పాలకుర్తి ప్రజలు రేవంత్ రెడ్డి మీద తిరగబడాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వ్యాఖ్యానించారు.

Exit mobile version