తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక టాపిక్ గురించే ప్రస్తావన జరుగుతోంది. అయితే ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆయా పార్టీల నేతలు వినూత్నంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మునుగోడు ప్రచారంలో మంత్రి దయాకర్‌రావు దూసుకుపోతున్నారు. అయితే.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నేను 40 సంవత్సరలుగా రాజకీయంలో ఉన్న,కేటీఆర్,కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే అన్ని క్లియర్ అయే విధిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత వరంగల్ ప్రపంచ స్థాయికి వేళ్లే విధిగా తయారవుతుంది. ఐటీ రంగంలో కూడా ముందుకు పోతున్నాము.
ఇండియా లోనే నెంబర్ వన్ ఐటీ పార్క్ లు మన తెలంగాణలోనే ఉన్నాయి. కాటన్ ఇండస్ట్రీలో వరంగల్ నెంబర్ వన్ కాబోతుంది. ఇండస్ట్రీస్ లలో వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఖిల్లవరంగల్, రామప్ప, వేయి స్తంభాల గుడిలకు యూనస్కో గుర్తింపు వచ్చింది. మహబూబాబాద్ కూడా రెండు మెడికల్ కాలేజ్ లు రాబోతున్నాయి. ఎన్నికల తరువాత వరంగల్ మీటింగ్ ఉంది,ఆ మీటింగ్ లో వరంగల్ ప్రజలకు శుభవార్త చెప్పబోతున్నాము. వరంగల్ కు మరో హై లెవెల్ బ్రిడ్జి రాబోతుంది. ఎయిర్‌పోర్ట్ కూడా దాదాపు క్లియర్ అయినటే అని ఆయన వ్యాఖ్యానించారు.