NTV Telugu Site icon

ERC : తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు లేనట్లే

Erc

Erc

ERC : ఏ కేటగిరిలోనూ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగా రావు వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని, అన్ని పిటిషన్ ల పై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించిందన్నారు. 40రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నామని, విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదని, స్థిర చార్జీలు రూ.10 యాదాతదం గా ఉంటుందన్నారు శ్రీరంగా రావు. పౌల్ట్రీ ఫామ్ , గోట్ ఫామ్ లను కమిషన్ ఆమోదించలేదని, HT కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశామని ఆయన తెలిపారు. 132kva, 133kva, 11kvలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయని, లిఫ్ట్ ఇరిగేషన్ కు కమిషన్ ఆమోదించిందన్నారు.

Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్‌లో దట్టమైన పొగలు..

టైమ్ ఆఫ్ డే లో పీక్ అవర్ లో ఎలాంటి మార్పు లేదని, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్ లో రూపాయి నుంచి 1:50 రాయితీ పెంచామని శ్రీరంగా రావు వెల్లడించారు. చేనేత కార్మికులకు హర్స్ పవర్ ను పెంచామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. Hp 10 నుంచి hp 25కి పెంచామని ఆయన పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు మినిమం చార్జీలు తొలగించామని, గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించిందన్నారు శ్రీరంగా రావు. ఆర్‌ఎస్పీ…ఇవి కేవలం ఐదు నెలల వరకే ఉంటాయని, రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందన్నారు. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారని, డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే, ఈఆర్సీ రూ. 54,183.28 కోట్లు ఆమోదించినట్లు ఆయన తెలిపారు.

Nadendla Manohar: రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతాం..