NTV Telugu Site icon

EPFO: చందాదారులకు షాకింగ్ న్యూస్.. అడ్వాన్స్‌ సదుపాయం నిలిపివేత

Epfo

Epfo

పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్‌వో షాకింగ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ సమయంలో కేంద్రం తీసుకొచ్చిన కోవిడ్‌ అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేసింది. ఈ సమాచారం ఉద్యోగులకు ఇబ్బందికరమే. ఓ వైపు లాక్‌డౌన్.. ఇంకో వైపు అన్ని ధరలు అమాంతంగా పెరిగిపోవడం… మరోవైపు ఉద్యోగాలు లేని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌వో అడ్వాన్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే కరోనా పరిస్థితులు ఇప్పుడు లేవు.. కేసులు లేవు.. ఆ వార్తలు వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయా అవసరాలకు అడ్వాన్స్ తీసుకున్న చందాదారులకు ఇబ్బందులు తలెత్తినట్లే.

ఇది కూడా చదవండి: China MeToo: మీటూ ఉద్యమంపై ఉక్కుపాదం.. మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు

కరోనా ఫస్ట్‌వేవ్‌ సందర్భంగా అడ్వాన్సు సదుపాయాన్ని ఈపీఎఫ్‌వో తీసుకొచ్చింది. రెండో వేవ్‌ వచ్చినప్పుడు మళ్లీ దీన్ని పునరుద్ధరించారు. అలా దాదాపు నాలుగేళ్లుగా అందుబాటులో ఉంది. తొలుత ఒకసారి మాత్రమే అడ్వాన్స్‌ పొందే అవకాశం కల్పించినా.. తర్వాత పలుమార్లు విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇందులో భాగంగా మూడు నెలల బేసిక్‌+ డీఏ లేదా ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న 75 శాతం వరకు మొత్తం విత్‌డ్రాకు అనుమతించారు. ఆ సమయంలో చాలామందికి ఈ సౌకర్యం ఉపయోగపడింది.

ఇది కూడా చదవండి: Hair Care Tips : మీ జుట్టు పెరగాలంటే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయండి(WS)

అయితే ఈ అడ్వాన్స్‌ను మరికొందరు ఇతర అవసరాలకు కూడా వాడుకున్నారని, దీనివల్ల వారి రిటైర్మెంట్‌ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్‌ సదుపాయం నిలిచిపోయినప్పటికీ.. ఇంటి కొనుగోలు, వివాహం, పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని నిర్దిష్ట పరిమితి మేరకు ఉపసంహరించుకునే వెసులుబాటు మాత్రం అందుబాటులో ఉంది.