మీ జుట్టును సమృద్ధిగా పెంచుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి అనేక సహజమైన మార్గాలు ఉన్నాయి.
హెయిర్ ఆయిల్స్, మాస్క్‌లతో స్కాల్ప్‌ను మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్‌ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
మసాజ్ చేసేటప్పుడు చేతి వేళ్లతో మసాజ్ చేయాలి.
కలబంద చాలా ఇళ్లలో కనిపించే ఒక మొక్క.
అలోవెరా జెల్ వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ జుట్టుకు బలం, అందం వస్తుంది.
కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది హెయిర్ షాఫ్ట్‌లోకి చొచ్చుకుపోయి ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది.
అంతేకాకుండా తలకు పట్టించిన కొబ్బరి నూనె స్కాల్ప్ మైక్రోబయోమ్‌ను మెరుగుపరుస్తుంది.
ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లలో ప్రోటీన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్లతో పాటు ఈ రకమైన ఒమేగా సప్లిమెంట్ తీసుకోవడం జుట్టు బలంగా ఉంటుంది.
ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.