EPFO కొత్త మొబైల్ యాప్.. UPI ద్వారా PF డబ్బు విత్‌డ్రా సౌకర్యం!

Epfo

Epfo

EPFO New App: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు త్వరలో మరింత సులభమైన సేవలు అందుబాటులోకి రాబితున్నాయి. EPF బ్యాలెన్స్‌ ను UPI ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకునే సౌకర్యంతో కొత్త మొబైల్ యాప్‌ ను కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యాప్‌ను మార్చి చివరలో లేదా ఏప్రిల్‌లో లాంచ్ కావచ్చని సమాచారం.

Emmanuel Macron: వచ్చే వారం భారత్ వస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్..

ప్రస్తుతం EPF డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే UAN పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. అయితే కొత్త యాప్ ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఈ యాప్ UMANG యాప్‌ లా కాకుండా కాస్త భిన్నంగా ఉండి, సభ్యుడి బ్యాంక్ అకౌంట్‌తో పాటు BHIM, ఇతర UPI యాప్‌లతో అనుసంధానం చేయబడుతుంది.

రాబోయే యాప్‌లో EPFO సభ్యులు తమ PF బ్యాలెన్స్‌ను చూడటం మాత్రమే కాకుండా, UPI సాయంతో డబ్బును నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ యాప్‌ పై డమ్మీ అకౌంట్లతో ట్రయల్స్ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. EPFO నిబంధనల ప్రకారం సభ్యులు తమ PF మొత్తంలో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. కనీసం 25 శాతం మొత్తం అకౌంట్‌లో కొనసాగాలి. ఒకవేళ పొరపాటున ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో మిగిలిన 25 శాతం మొత్తాన్ని 12 నెలల తర్వాత మాత్రమే పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

Farzi Season 2 Update: రాజ్ & డీకే డైరెక్షన్‌లో.. ఫర్జీ రౌండ్ 2 ఇన్ ప్రోగ్రెస్!

దేశంలో ప్రస్తుతం సుమారు 30 కోట్ల మంది EPFO సభ్యులు ఉన్నారు. అందులో సరిగ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్న సభ్యులు సుమారు 7.5 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. EPFO మొత్తం కార్పస్ విలువ సుమారు రూ. 26 లక్షల కోట్లకు చేరువలో ఉంది. మొత్తంగా కొత్త యాప్ ప్రారంభమైతే PF డబ్బు ఉపసంహరణ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా మారనుంది.