Site icon NTV Telugu

Keerthy Suresh: వెంకీ మామతో మహానటి జోడీ.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా!

Keerthy Suresh

Keerthy Suresh

Keerthy Suresh: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ – హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది సక్సెస్‌పుల్ కాంబినేషన్. గతంలో ఈ ఇద్దరి దర్శకత్వంలో వచ్చిన F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించాయి. ఇప్పుడు జోడీ తమ తదుపరి చిత్రానికి శ్రీకారం చూట్టినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 2026 నుంచి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తిసురేష్ దాదాపు ఫిక్స్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ ALSO: Yogi Adityanath: “బాబ్రీ మసీదు” ఎప్పటికీ నిర్మితం కాదు.. వారి కలలు నిజం కావు..

అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ కనిపించబోతున్నారని సమాచారం. ఫహద్ ఫాసిల్ – వెంకీ మామా మధ్యలో వచ్చే సన్నివేషాలు ఈ చిత్రానికే ప్రత్యేకంగా నిలుస్తాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చనే టాక్ నడుస్తుంది. ఈ చిత్రాన్ని కూడా హిట్ మిషన్ అనిల్ రావిపూడి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నిజానికి అనిల్ రావిపూడి అంటేనే సంక్రాంతి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయకుండా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ఈ సినిమాను విడుదల చేయడానికి అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ చేస్తు్న్నట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘ఆదర్శ కుటుంబం – AK 47’ అనే సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే అనిల్ డైరెక్షన్‌లో సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.

READ ALSO: Balakrishna – Harish Shankar: గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో గాడ్ ఆఫ్ మాసెస్ సినిమా..! టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్ లోడింగ్?

Exit mobile version