Site icon NTV Telugu

Tollywood strike: టాలీవుడ్‌లో మళ్లీ ‘సమ్మె’ సైరన్..

Tollywood

Tollywood

Tollywood strike: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి అసమ్మతి సెగలు రాజుకున్నాయి. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందంటూ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఆయా యూనియన్ల ప్రతినిధులు ఘాటుగా లేఖలు రాశారు.

READ ALSO: CM Revanth Reddy : జిల్లాల కుదింపు లేదు.. మూసీ ప్రాజెక్ట్ ఆగేది లేదు

ప్రధానంగా టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్లు తమ సమస్యలను తెరపైకి తెచ్చాయి. ఈ నెల (ఫిబ్రవరి) ఆఖరులోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. కేవలం ఈ రెండు యూనియన్లే కాకుండా, వీరి బాటలోనే మరో 11 యూనియన్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

రంగంలోకి సినీ పెద్దలు..
మార్చి నుంచి షూటింగ్‌లు ఆగిపోతే ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలపై ఈ ప్రభావం పడనుంది. దీంతో ఫెడరేషన్ అధ్యక్షులు, ఇతర పెద్దలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి రంగంలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం, ఛాంబర్ పెద్దలతో చర్చించి, సమ్మె ఆలోచనను విరమింపజేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ నెలాఖరులోపు చర్చలు ఫలించకపోతే, టాలీవుడ్‌లో కెమెరాలు మూతపడే ఛాన్స్ ఉంది.

READ ALSO: Best Gadget Under రూ.300: బెస్ట్ గ్యాడ్జెట్.. ఈ చిన్న మిషన్ చేసే మ్యాజిక్ చూడండి!

Exit mobile version