Prabhas Spirit: ఒక సంచలన యువ దర్శకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్.. సందీప్ రెడ్డి వంగా. ఒక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్.. ‘స్పిరిట్’. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ‘స్పిరిట్’ సినిమాను 2027 మార్చి 5న రిలీజ్ అవుతుందని డైరెక్టర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 2027 మార్చి 5న సినిమా రిలీజ్ కావడానికి అసలు కారణం తెలుసా..
READ ALSO: CM Revanth Reddy : ట్రాఫిక్ చిక్కులకు ‘యువ ఐపీఎస్ ‘లతో చికిత్స చేయించాలని సీఎం యోచన.!
‘స్పిరిట్’ విడుదల తేదీని గమనిస్తే.. 2027 మార్చి 5వ. ఆ రోజు శుక్రవారం అవుతుంది. తర్వాత రోజు మహా శివరాత్రి పండగ (6వ తేదీన శనివారం) ఉంది. దాని తర్వాత వచ్చే రోజు ఆదివారం (7వ తేదీ) అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే.. స్పిరిట్ సినిమా రిలీజైన వెంటనే వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. వాస్తవానికి ఇది సినిమా కలెక్షన్స్‌కు కలిసొచ్చే విషయం. ఈ మూవీ టీమ్ కోరుకుంటున్నది కూడా ఇదే. అతిపెద్ద సినీరంగ మార్కెట్ అయిన భారత్‌లో తొలి మూడు రోజుల్లోనే వీలైనన్ని ఎక్కువ కలెక్షన్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అలాగే మార్చి 10న (బుధవారం) రంజాన్ పండుగ వస్తోంది. మార్చి 13, 14 తేదీల్లో (శని, ఆది) వీకెండ్ ఉంది. మార్చి 22న (సోమవారం) హోలీ పండుగ ఉంది. మార్చి 26న (శుక్రవారం) గుడ్ ఫ్రైడే, మార్చి 27, 28 తేదీల్లో మళ్లీ (శని, ఆది) వీకెండ్ వస్తుంది. ఈ సెలవులు సిర్పిట్ సినిమా కలెక్షన్లకు కీలకంగా మారుతాయని మూవీ టీమ్ అంచనా వేస్తున్నట్లు సినీ సర్కిల్‌లో టాక్ నడుస్తుంది. ఈ చిత్ర రిలీజ్ విషయానికి వస్తే తెలుగు, హిందీ, చైనీస్, కొరియన్ వంటి 8 భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా స్పిరిట్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాలని వంగా భారీ స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
Spirit Release Date || March 5th 2027 #Spirit @OneBadHabit#Prabhas @imvangasandeep @tripti_dimri23 @vivekoberoi @rameemusic @sureshsrajan #BhushanKumar #KrishanKumar @ShivChanana @neerajkalyan_24 @InSpiritMode @VangaPictures @TSeries @tseriessouth @anilandbhanu @WallsAndTrends… pic.twitter.com/kNgKnRtF1Y
— Bhadrakali Pictures (@VangaPictures) January 16, 2026
READ ALSO: Iran Protests: రక్తసిక్తమైన ఇరాన్! నిరసనల సెగకు 5 వేల మంది బలి..
