Site icon NTV Telugu

AMB Banglore: బెంగళూరులో మహేష్ ఏఎంబి..ఆరోజే ఓపెనింగ్

Mahesh Babu

Mahesh Babu

AMB Banglore: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన ఏఎంబీ మల్టీప్లెక్స్ (AMB Cinemas) ఇప్పుడు బెంగళూరులో అడుగుపెడుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతంగా నడుస్తున్న ఈ మల్టీప్లెక్స్, డిసెంబర్ 16వ తేదీన బెంగళూరులో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్‌ను మహేష్ బాబు ఏసియన్ సంస్థతో (Asian Cinemas) కలిసి ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఈ కొత్త మల్టీప్లెక్స్ డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఏఎంబీ మల్టీప్లెక్స్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతోంది.

READ ALSO: Delhi Drug Trafficking: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత.. అడ్డంగా బుక్ అయిన కేటుగాళ్లు

బెంగళూరులో జరగనున్న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, ఆయన హాజరు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ అయిన ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నారు. ఒకవేళ మహేష్ బాబు కొత్త సినిమా లుక్ రివీల్ అయ్యే అవకాశం ఉంటే, ఆ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడటం కోసం ఆయన ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవచ్చు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా, ఏఎంబీ మల్టీప్లెక్స్ బెంగళూరులో ప్రారంభం కావడం అక్కడి సినిమా ప్రేమికులకు మంచి వార్త. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

READ ALSO: Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి

Exit mobile version