Site icon NTV Telugu

OTT Movies : ఈ వారం ఓటీటీలో ఎంటర్టైనింగ్ మూవీస్ ఇవే

Ott

Ott

ఎవ్రీ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే సినిమాల కోసమే కాదు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్‌ల కోసం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సినీ లవర్స్. అలా ఈ వారం ఉన్నవే కొన్నైనా, అన్ని జోనర్ల మూవీస్ డిజిటల్ ఫ్లాట్‌ ఫార్మ్స్‌లోకి వచ్చేశాయి.

1. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీలోకి వచ్చేసింది. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. చిన్న సినిమాగా వచ్చి మంచి అప్లాజ్ తెచ్చుకున్న సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్- టీనా శ్రావ్య జంటగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కామెడీ ఎంటర్టైనర్ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

3.బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జటాధర కూడా ఓటీటీ బాట పట్టింది. సుధీర్ బాబు సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. డిసెంబర్ 5 న ఈ సినిమా ఓటీటీ లవర్స్ ముందుకు వచ్చేసింది.

Also Read : kollywood : హీరోయిన్ కు కోలీవుడ్ కష్టాలు తీరేదెపుడో

4. మాలీవుడ్ నుండి ఇంట్రస్టింగ్ అండ్ ఎంగేజింగ్ అనిపించే హారర్‌ మిస్టరీ ఫిల్మ్‌ డీ ఎస్‌ ఈరే. ప్రణవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు భ్రమ యుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకుడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

5. వైభవ్ హీరోగా నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ వన్ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ స్టీఫెన్ నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. కన్నడ కామెడీ డ్రామా అరసయ్యన ప్రేమ పసంగ సన్‌నెక్ట్స్‌లో అవైలబుల్‌గా ఉంది.

6. తమిళ్ రైజింగ్ హీరో అశ్విన్ కుమార్ హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్.. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్. తెలుగు అండ్ తమిళ్‌లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. డిసెంబర్ 5 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కుట్రమ్ పురింద వన్ సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.

7. కొరియన్ డ్రామాలకు భారత్ లో ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందుకే వారానికి ఒక్క మూవీ లేదా సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీగా అవుతున్నాయి. ఈ వారం కూడా ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ సిరీస్‌ను నెట్ ఫ్లిక్స్ తీసుకువచ్చింది. అలాగే హాలీవుడ్ వెబ్ సిరీస్ ద అబాండన్స్, షూర్ లీ టుమారో సిరీస్‍లు నెట్ ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. హిందీ కామెడీ సిరీస్ ఘర్ వాలీ పెడ్వాలీ జీ5లో సందడి చేస్తోంది.

Exit mobile version