Alastair Cook: క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ పలికాడు. కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా తన సేవలు అందించాడు. 2018 సెప్టెంబర్ లోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ పలికినప్పటికీ.. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు. ఇప్పుడు తన 38 ఏళ్ల వయస్సులో అన్ని రకాల ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టు ఫార్మాట్‌లో పదివేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్ గా అలిస్టర్ కుక్ ఉన్నాడు.
అలిస్టర్ కుక్ క్రికెట్‌లో వేల పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 161 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 291 ఇన్నింగ్స్‌లలో 12,472 పరుగులు చేశాడు. అతని సగటు 45.35 కాగా.. బెస్ట్ స్కోరు 294 పరుగులు ఉన్నాయి. కుక్ తన టెస్టు కెరీర్‌లో 33 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక వన్డేలలో 92 మ్యాచ్‌లలో 92 ఇన్నింగ్స్‌లలో 36.40 సగటు, 77.13 స్ట్రైక్ రేట్‌తో 3204 పరుగులు చేశాడు. వన్డేలలో 5 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు చేశాడు. ఇక టీ20ల్లో కేవలం 4 మ్యాచ్‌లు ఆడి 61 పరుగులు చేశాడు.
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో అలిస్టర్ కుక్ కు మంచి కెరీర్ ఉంది. అతను మొత్తం 352 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాగా.. 619 ఇన్నింగ్స్‌లలో 46.41 సగటుతో 26,643 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. కుక్ 74 సెంచరీలు, 125 అర్ధ సెంచరీలు చేశాడు. కుక్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో మొత్తం 386 క్యాచ్‌లు పట్టాడు. 2006లో నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున కుక్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి.. దేశీయ క్రికెట్ పై దృష్టి పెట్టాడు.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!