NTV Telugu Site icon

IND vs ENG: భారత్ బౌలర్ల విజృంభణ.. తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్

Team India

Team India

ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో.. 248 పరుగులకే ఆలౌట్ అయింది. 47.4 ఓవర్లకే ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసింది టీమిండియా. దీంతో భారత్ ముందు 249 పరుగుల లక్ష్యం ఉంచింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (43), బెన్ డకెట్ (32) ఆరంభంలో రాణించారు. మొదటి 70 పరుగుల వరకు ఇంగ్లాండ్ జట్టు ఒక వికెట్ కూడా కోల్పోలేదు. ఆ తరువాత వికెట్లు వరుసగా పడిపోయాయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బెథెల్ (51) హాఫ్ సెంచరీలు సాధించారు. చివరలో జోఫ్రా ఆర్చర్ 21 పరుగులతో రాణించాడు. జో రూట్ (19), కార్సే (10) చేశారు.

Read Also: Heart Disease: ఇలాంటి స్త్రీలలో గుండెపోటు ప్రమాదం తక్కువ..

ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో 3 వికెట్లు పడగొట్టారు. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్‌ తీశారు. దీంతో.. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎక్కువ పరుగులు తీయకుండా కట్టడి చేశారు. ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లాలంటే.. భారత్ 249 పరుగుల లక్ష్యం సాధించాల్సి ఉంటుంది.

Read Also: Mastan Sai: మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్..డ్రగ్స్ తో పరార్?