NTV Telugu Site icon

England vs Australia: ఇంగ్లాండ్ దెబ్బకి చిన్నబోయిన ఆస్ట్రేలియా.. భారీ విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్!

England Vs Australia

England Vs Australia

England vs Australia: లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 31 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 27 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ వన్డేలో ఇంగ్లాండ్ 39 ఓవర్లలో 312/5 స్కోరు చేసింది. లార్డ్స్‌లో జరిగిన నాల్గవ వన్డేలో ఆతిథ్య జట్టు 186 పరుగుల విజయాన్ని అందుకుంది. దింతో 5 వన్డేల సిరీస్ 2-2 తో సమం అయ్యింది.

Chiranjeevi – Venkatesh – Balakrishna: చూడడానికి రెండు కళ్లు సరిపోవట్లేదుగా.. ఒకే ఫ్రేములో ముగ్గురు లెజెండ్స్!

వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. దింతో తొలి 2 వన్డేల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 5 వన్డేల సిరీస్ ను ప్రస్తుతం 2-2 తో ఇంగ్లండ్ సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో, చివరి మ్యాచ్ సెప్టెంబర్ 29న జరగనుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (58 బంతుల్లో 87), బెన్ డకెట్ (62 బంతుల్లో 63), లియామ్ లివింగ్స్టోన్ (27 బంతుల్లో 62 *) హాఫ్ సెంచరీలతో ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.

IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం విజేతలు వీరే.. లిస్టులో టాలీవుడ్ అగ్రతారలు!

ఇక ఛేదనకి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ మిచెల్ మార్ష్ 28 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 34 పరుగులు చేశాడు. వారి తర్వాత వచ్చిన అలెక్స్ కారీ (13), సీన్ అబోట్ (10) ఉన్నారు స్టీవ్ స్మిత్ (5), జోష్ ఇంగ్లిస్ (8), మార్నస్ లబుషేన్ (4), గ్లెన్ మాక్స్వెల్ (2) ఫ్లాప్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ నాలుగు, బ్రైడెన్ కార్స్ మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హరీ బ్రూక్ ఎన్నికయ్యాడు.