Site icon NTV Telugu

IND vs ENG: టీమిండియా అదరహో.. 132కి కుప్పకూలిన ఇంగ్లాండ్..

Ind Vs Eng

Ind Vs Eng

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు 2025లో తన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతోంది. కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టు 132 పరుగులకే కుప్పకూలింది. బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత్‌కు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ జోస్ బట్లర్ అత్యధిక స్కోరు 68 పరుగులు చేశాడు. భారత్ తరఫున స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గరిష్టంగా 3 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీశారు.

READ MORE: Parada Teaser : ఆసక్తికరంగా పరదా టీజర్.. చూశారా?

కాగా.. గత ఆరేళ్లుగా స్వదేశంలో భారత జట్టు టీ20 సిరీస్‌ను కోల్పోలేదు. టీం ఇండియా చివరిసారిగా 2019లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఓడిపోయింది. అప్పటి నుంచి భారత్‌ సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో అజేయంగా ఉంది. స్వదేశంలో భారత జట్టును అజేయంగా ఉంచే సవాల్ సూర్య భుజస్కంధాలపై ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడేళ్ల తర్వాత టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది.

READ MORE: Trump-Modi: వచ్చే నెలలో ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యే ఛాన్స్

Exit mobile version