NTV Telugu Site icon

Ashes 2023: అరెరే శాండ్‌పేపర్‌ తేవడం మరిచిపోయా.. ఆస్ట్రేలియా ప్రధానికి కౌంటర్‌ ఇచ్చిన ఇంగ్లండ్ ప్రధాని!

Untitled Design (2)

Untitled Design (2)

England And Australia PM’s Engage In Hilarious Ashes 2023 Banter: యాషెస్ 2023 సిరీస్‌ ప్రభావం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులపైనా పడింది. ‘నాటో’ సమ్మిట్‌లో భాగంగా ఇంగ్లండ్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌ యాషెస్‌ 2023పైన చర్చించారు. ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఔట్‌ను ప్రస్తావిస్తూ.. ఆసీస్ ప్రధానికి ఇంగ్లండ్ ప్రధాని ఫన్నీగా కౌంటర్‌ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియోను ఆస్ట్రేలియా ప్రధాని ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో ఔట్‌ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. బంతి డెడ్‌ కాకముందే.. బెయిర్‌స్టో క్రీజు దాటడంతో ఆస్ట్రేలియా కీపర్‌ అలెక్స్‌ కేరీ వికెట్లకు బంతిని విసిరాడు. నిబంధనల ప్రకారం బెయిర్‌స్టోను థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ అని ప్రకటించాడు. దీనిపై అని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఆస్ట్రేలియా ప్రవర్తించిందంటూ ఇంగ్లీష్‌ అభిమానులు, మీడియా కోడై కూసింది. లీడ్స్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో కూడా ఈ వివాద ప్రభావం పడింది. ఆసీస్ కీపర్ అలెక్స్‌ కేరీ కనిపించినప్పుడల్లా ఇంగ్లీష్‌ అభిమానులు అతన్ని టార్గెట్‌ చేశారు.

Also Read: IND vs WI: నాడు తండ్రి, నేడు కొడుకు.. అరుదైన లిస్టులో విరాట్ కోహ్లీ! ఒకే ఒక్కడు సచిన్

ఇక జానీ బెయిర్‌స్టో ఔట్‌ వివాదంపై ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులపైనా పడింది. ఇరు దేశాల ప్రధానులు జోకులు కూడా పేల్చుకున్నారు. నాటో సమ్మిట్‌లో భాగంగా ప్రధానులు ఇద్దరు యాషెస్‌పై మాట్లాడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది. వీడియోలో ఆసీస్‌ ప్రధాని తమ జట్టు 2-1 ఆధిక్యంలో ఉందనే ప్లకార్డును ప్రదర్శించగా.. లీడ్స్‌ టెస్టులో ఇంగ్లండ్ గెలిచిందని రిషి సునాక్‌ ఇంకో ప్లకార్డు ప్రదర్శించారు. జానీ బెయిర్‌స్టో ఔటైన విధానంకు సంబంధించిన పేపర్‌ క్లిప్‌ను ఆసీస్‌ ప్రధాని చూపించగా.. ‘నేను శాండ్‌పేపర్‌ను తీసుకురావడం మరిచిపోయా’ అని ఇంగ్లీష్ ప్రధాని అన్నారు. దీంతో ఇద్దరు కలిసి నవ్వులు చిందించారు. ఆ తర్వాత ఇద్దరూ కరచాలనం చేసుకుని వెళ్లిపోయారు.

‘శాండ్‌ పేపర్‌’ వివాదం 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సందర్భంగా జరిగింది. ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ ఓ చిన్న శాండ్‌పేపర్‌తో బంతిని రుద్దడం టీవీల్లో కనిపించింది. బంతి ఆకారాన్ని శాండ్‌పేపర్‌ ఉపయోగించినట్లు తేలింది. ఈ కుట్ర వెనుక అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్, వైస్‌ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ ఉన్నట్లుగా తేలడంతో వారిపై ఏడాది పాటు నిషేధం పడింది. బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం పడింది. ఏడాది అనంతరం స్మిత్, డేవిడ్ వార్నర్‌ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చినప్పటి నుంచి ఫాన్స్ ‘ఛీటర్స్ ఛీటర్స్’ అంటూ ఆటాడుకుంటున్నారు.

Also Read: Toyota Fortuner Price 2023: 15 లక్షలకే టయోటా ఫార్చ్యూనర్‌.. క్షణాల్లో డెలివరీ కూడా!