రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జరుగుతుంది. అందులో భాగంగా ఇంగ్లండ్కు టీమిండియా గట్టి షాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ టార్గెట్ 192 పరుగులు చేయాల్సి ఉంది. కాగా.. భారత్ బౌలర్లు ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బ తీశారు. భారత్ బౌలింగ్ లో అశ్విన్ 5 వికెట్లు తీసి చెలరేగాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 4, జడేజా ఒక వికెట్ సంపాదించాడు. ఇక.. ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలే 60 పరుగులు, బెయిర్ స్టో 30 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇప్పటికే భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్ ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలిచింది. కాగా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆత్రుతగా ఉంది భారత్.
IND vs ENG: ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన భారత్.. ఇండియా టార్గెట్ ఎంతంటే.. ?

Cricket