Site icon NTV Telugu

B.Tech Student Suicide: తల్లి మందలించిందని.. తన తండ్రి పిస్టల్‌తో కాల్చుకుని కొడుకు ఆత్మహత్య

B.tech Student Suicide

B.tech Student Suicide

B.Tech Student Suicide: బెంగళూరులోని తన నివాసంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి తన తండ్రి లైసెన్స్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గురువారం తెలిపారు. 19 ఏళ్ల విషు ఉతప్ప బుధవారం తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఛాతీపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘చదువు విషయంలో తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని.. చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని తల్లి మందలించిందని, అయితే త్వరలోనే వారిద్దరూ బాగా కలిసిపోయారు. తల్లీకొడుకులు ఎప్పటిలాగే ప్రేమగానే ఉంటున్నారు. కానీ అతను ఈ చర్య తీసుకోవడం వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. విద్యార్థి తన తల్లి మందలించడం వల్ల ఈ చర్య తీసుకున్నాడా లేదా మరేదైనా కారణమా అనేది పోలీసులు విచారిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

Read Also: Udhayanidhi Stalin: వరద సాయం కోరుతూ ప్రధాని మోడీని కలిసిన ఉదయనిధి స్టాలిన్

అతని తండ్రి గత ఏడేళ్లుగా నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ (NICE)లో ఉద్యోగం చేస్తున్నాడు. NICE టోల్ రోడ్‌పై వసూలు చేసిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయడంతో పాటు అతని పనిలో భద్రత కోసం లైసెన్స్ పొందిన పిస్టల్‌ని తీసుకున్నాడు. ఇప్పడు ఆ పిస్టల్‌తోనే కన్నకొడుకు ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Exit mobile version