ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG W vs SL W: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో జరిగిన గ్రూప్-2 తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ శ్రీలంక పై 87 పరుగుల భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో శ్రీలంక 132 పరుగులకే ఆలౌటైంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు అమీ జోన్స్, డ్యానీ వ్యాట్-హాడ్జ్ మంచి ఆరంభాన్ని అందించారు. అమీ జోన్స్ 38 బంతుల్లో 53 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగినా, మరోవైపు డ్యానీ వ్యాట్-హాడ్జ్ శ్రీలంక బౌలర్లపై వీరవిహారం చేసింది. ఆమె కేవలం 62 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో అజేయంగా 105 పరుగులు చేసి మొదటి మ్యాచ్ లోనే శతకం నమోదు చేసింది. ఇక కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ కూడా 22 బంతుల్లో 46 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లండ్ స్కోరు 219/1కి చేరుకుంది. ఇక శ్రీలంక బౌలర్లలో మాల్కి మదారా ఒక్క వికెట్ మాత్రమే సాధించింది. మిగతా బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్ల దూకుడును అడ్డుకోలేకపోయారు.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు మొదటి నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ చమరి అతపత్తు కేవలం 4 పరుగులకే ఔటవ్వగా, విష్మి గుణరత్నే, ఇమేషా దులాని కూడా త్వరగా పెవిలియన్ చేరారు. హర్షిత సమరవిక్రమ 29 పరుగులతో, నిలాక్షికా సిల్వా 39 పరుగులతో కొంత పోరాడినా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రేయా కెంప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టింది. సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్ చెరో రెండు వికెట్లు సాధించగా.. లారెన్ బెల్, లిన్సీ స్మిత్ చెరో వికెట్ తీసుకున్నారు. సమిష్టి బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ శ్రీలంకను పూర్తిగా కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో జట్టును భారీ స్కోరుకు చేర్చిన డ్యానీ వ్యాట్-హాడ్జ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రపంచకప్‌ను ఘనంగా ప్రారంభించింది.
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!