ఎడ్జ్ బస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. మొదటి రోజు బ్యాటింగ్ చేసిన భారత్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో అలరించాడు. సారథిగా ఫుల్‌టైమ్ బాధ్యతలు చేపట్టిన గిల్.. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాను మొదట్లోనే దెబ్బ కొట్టింది. ఓపెనర్ లోకేష్ రాహుల్‌ను 2 పరుగులకే వెనక్కి పంపాడు క్రిస్ వోక్స్. ఆ తర్వాత యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ 87 పరుగులు చేయగా.. నాయర్ 31, రిషబ్ పంత్ 25 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ సమయంలో కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతంగా ఆడుతూ.. ఈ సిరీస్లో వరుసగా రెండవ సెంచరీ సాధించాడు. దీంతో ఓ రికార్డు కూడా క్రియేట్ చేశాడు.
Also Read: CM Chandrababu: బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు.. తెలుగు ప్రజలు బాగుంటారు!
సెంచరీతో శుభ్‌మన్ గిల్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత కెప్టెన్‌గా సెంచరీ చేసిన రెండవ సారథిగా గిల్ నిలిచాడు. గతంలో కింగ్ కోహ్లీ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. 2018లో ఎడ్జ్‌బాస్టన్‌లో కెప్టెన్‌గా కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇప్పుడు గిల్ సెంచరీ బాదాడు. 2015లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. 2018లో సెంచరీ చేశాడు. గిల్ మాత్రం సారథిగా ఆడిన రెండో టెస్టులోనే శతకం బాదాడు. ఇక గిల్ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మొత్తంగా 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా కూడా 41 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజులు ఈ ఇద్దరు నిలిస్తే.. భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం.
