Rishabh Pant: రిషబ్ పంత్‌పై నిషేధం పడుతుందా?
- ఆన్-ఫీల్డ్ అంపైర్‌పై అసహనం
- పంత్‌పై నిషేధం పడుతుందా?
- పంత్‌కు కఠిన శిక్ష పడే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆన్-ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసిన కారణంగా.. పంత్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంత్ రెండు ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఐసీసీ తేల్చే అవకాశం ఉంది. ఐసీసీ నియమాలిని ఉల్లంగించినట్లు తేలితే పంత్‌కు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 61వ ఓవర్‌లో మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని హ్యారీ బ్రూక్ బౌండరీకి పంపించాడు. తర్వాత టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బంతి మార్చాలని ఆన్-ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్‌ను కోరారు. బంతిని బాల్ గేజ్ ద్వారా పరిశీలించిన అంపైర్.. బాల్ అంతా బాగుందని, ఇంకా ఆడేందుకు అనుకూలంగా ఉందని చెప్పాడు. దాంతో పంత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్‌తో వాదించాడు. అంపైర్ ససేమిరా అనడంతో.. బంతిని మైదానంలోకి విసిరి వెళ్లిపోయాడు. అంతేకాదు ఏదో మాట్లాడుతూ వెనక్కి తిరిగాడు. పంత్ ప్రవర్తనపై అప్పుడే వ్యాఖ్యలు కూడా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదని కామెంటేటర్ మార్క్ బౌచర్ అన్నాడు.
Also Read
- Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
- BRAOU Ph.D: అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ఏ ఏ సబ్జెక్టుల్లో అంటే..
Also Read: BCCI-IPL: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. బీసీసీఐ కీలక నిర్ణయం!
మైదానంలో ఆన్-ఫీల్డ్ అంపైర్‌తో గొడవపడినందుకు రిషబ్ పంత్‌కు రెండు నిబంధనల ఉల్లంఘన కారణంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8లోని లెవెల్ 1 కింద అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు.. పంత్‌ను దోషిగా పరిగణించవచ్చు. క్లాజ్(ఎ), క్లాజ్(హెచ్) కింద అంపైర్ నిర్ణయంపై సుదీర్ఘ చర్చలు జరిపినందుకు చర్యలు తీసుకోవచ్చు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినందుకు కూడా దోషిగా పరిగణించవచ్చు. ఐసీసీ నుంచి పంత్ ఆంక్షలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. జరిమానా, హెచ్చరికతో సరిపెడతారా? లేదా మ్యాచ్ బ్యాన్ చేస్తారా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
-
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
-
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. ’90స్’ డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
-
Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
-
Ranveer – Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!