Site icon NTV Telugu

Ashes 2023: అలెక్స్ కేరీకి షూస్ చూపించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్

Alex Carey

Alex Carey

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మంచి రంజు మీద సాగుతుంది. రెండో రోజు ఆటలో ఆసీస్‌ బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోతున్నారు. ముఖ్యంగా ఆసీస్ సారథి కమిన్స్‌ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడి ఇంగ్లండ్‌ టీమ్ పతనం శాసించాడు. ప్రస్తుతం ఇంగ్లీస్ జట్టు రెండో సెషన్‌లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులతో గేమ్ కొనసాగిస్తుంది. బెన్ స్టోక్స్‌ 60 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తుండగా.. ప్యాట్ కమిన్స్‌ ఆరు వికెట్లతో రెచ్చిపోయాడు. స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 51 పరుగులు చేయాల్సి ఉంది.

Read Also: Nayakudu Trailer: నాయకుడు ట్రైలర్.. వడివేలు నట విశ్వరూపం

లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్‌ స్టో ఔటైన వివాదాన్ని ఇంగ్లండ్‌ ఫ్యాన్స్ ఇప్పట్లో మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీకి ఇంగ్లీష్ ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్‌ మైదానం జానీ బెయిర్‌ స్టోకు హోమ్‌ గ్రౌండ్‌.. కాగా బెయిర్‌ స్టో ఇలాకాలో ఇంగ్లండ్‌ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు.

Read Also: Chandrababu: సీఎం గ్రాఫ్ పడిపోయింది.. పులివెందులలో జగన్‌కు ఓటమి ఖాయం..!

ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ కేరీ ఔటయి పెవిలియన్‌ కు వెళ్తున్న టైంలో ఇంగ్లండ్‌ ఫ్యాన్స్ అతన్ని గేలి చేస్తూ.. గుడ్‌ బై.. ఇక గ్రౌండ్ లోకి రాకు.. వస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుందంటూ చప్పట్లు కొట్టారు. మరి కొంతమంది అభిమానులు అయితే మరి ఓవరాక్షన్ గా షూస్‌ విప్పి చేతిలో పట్టుకొని అలెక్స్ కేరీ వైపు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆసీస్ అభిమానులు కూడా కాస్త ధీటుగానే రియాక్ట్ అవుతున్నారు.

Read Also: Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసిన సీబీఐ

లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు తొలి సెషన్‌ ఆటలో ఇంగ్లండ్‌ 193/5గా ఉన్న టైంలో గ్రీన్‌ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్‌ కీపర్‌ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్‌ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు సాగాడు.. వెంటనే వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ బంతిని స్టంప్స్‌ పైకి విసిరాడు. దీంతో థర్డ్‌ అంపైర్‌.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర వివాదానికి దారి తీసింది. అందులో భాగంగానే అలెక్స్ కేరీకి ఇంగ్లండ్ అభిమానులు షూస్ చూపించారు.

Exit mobile version