Site icon NTV Telugu

AP E-Challan Scam: ఏపీలో ఈ – చలాన్ స్కామ్.. కేసు నమోదు చేసిన ఈడీ

Ed

Ed

AP E-Challan Scam: ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యే ట్రాఫిక్ ఈ-చలాన్లలో నిధుల గోల్ మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం విదితమే.. వాహనదారుల నుండి పోలీసులు వసూలు చేసే నిధులను సొంత ఖాతాలకు డేటా ఇవాల్వ్ సొల్యూషన్స్ కంపెనీ మళ్లించుకున్నట్టు అభియోగాలు నమోదు చేశారు. సుమారు 36.53 కోట్ల రూపాయలు నిధులు దారి మల్లాయని కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ చల్లాన్ ద్వారా రూ.101 కోట్లకు పైగా వసూలు చేసిన డేటా ఇవాల్వ్ సంస్థ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని సొంత ఖాతాలకు తరలించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.. అయితే, దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు ఏపీ ట్రాఫిక్‌ ఈ చలాన్‌ స్కామ్‌పై కేసు నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)..

Read Also: Sara Ali Khan : ఆధ్యాత్మిక యాత్రలో బాలీవుడ్ బ్యూటి..చార్ ధామ్ టూర్ లో సారా..

ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల ద్వారా వచ్చిన నిధులను అవినాష్ అనే వ్యక్తి దారిమళ్లించినట్టు అభియోగాలు మోపారు.. అవినాష్ కి చెందిన ఇవాల్వ్ సంస్థతోపాటు పలువురుపై కేసు నమోదు చేశారు.. 36 కోట్ల రూపాయలకు పైగా నిధులను దారి మళ్లించారని అవినాష్ పై ఆరోపణలు ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అల్లుడే అవినాష్ కావడంతో.. కేసు మరింత ఆసక్తికరంగా మారింది. రోజర్ పే ద్వారా వచ్చిన డబ్బులని సొంత సంస్థలకి దారి మళ్లించారు అవినాష్.. ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన డబ్బులు మళ్లించడంతో ప్రభుత్వానికి నష్టం చేకూర్చాడు.. ట్రాఫిక్ చలాన్ల నిధుల మళ్లింపులో హవాలా, మనీ ల్యాండరింగ్‌ జరిగినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

Exit mobile version