Sara Ali Khan : ఆధ్యాత్మిక యాత్రలో బాలీవుడ్ బ్యూటి..చార్ ధామ్ టూర్ లో సారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సారా అలీఖాన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలివుడ్ ముద్దుగుమ్మ సినిమాలు, యాడ్ లతో బాగానే సంపాదిస్తుంది.. సైఫ్ అలీఖాన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన నటన టాలెంట్ తో అందరిని ఆకట్టునకుంది.. దాంతో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉంది.. ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్ స్టయిల్ సెపరేటే.. ఇక సారా ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉందని తెలుస్తుంది.. చార్ ధామ్ యాత్రలో ఉన్న సారా ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
సారా అలీ ఖాన్ ఆధ్యాత్మిక యాత్రలో మునిగితేలుతోంది. భక్తి పారవశ్యంలో తేలుతోంది బ్యూటీ.. ఇటీవల సారా ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమేన కేదార్‌నాథ్‌కు వెళ్లొచ్చింది. హిమాలయ పర్వత సానువుల్లోని ఎత్తైన కొండ దారిలో నడుచుకుంటూ వెళ్లి కేదార్‌నాథీశ్వరుడిని దర్శించుకుంది.. ఎంతో కష్టమైన, అందరు మెచ్చే చార్‌ధామ్ యాత్రను.. సారా అలీ ఖాన్ పూర్తి చేశారు. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సారా సంగీతం వింటూ ట్రెక్కింగ్ చేస్తున్న దృశ్యాలు, బండరాయి మీద ధ్యాన ముద్రలో ఉన్న ఫొటోలు, సాధువు ఆమెను ఆశీర్వదిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ యాత్రను తన ఫ్రెండ్స్ తో కలిసి చేసినట్లు ఉంది..
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
ఈ అమ్మడు గతంలో ఓసారి కేదార్‌నాథ్కు వెళ్లింది.. తన మొదటి సినిమా షూటింగ్ అక్కడే జరిగింది.. ఇక్కడ ప్రతీ విషయం ఆమెకు తెలుసు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మంచి వసూళ్లు కూడా సాధించింది. కేదార్ నాధ్ సినిమా తరువాత సారా అలీఖాన్ .. లవ్ ఆజ్ కల్, లూకా చిప్పి, జరా హట్కే జరా బచ్‌కే వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కుమార్తె సారా.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది..
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!